Home /News /movies /

ACTOR NITHIN REDDY TO HAVE A LOVE MARRIAGE VERY SOON HERE THE DETAILS SR

ప్రేమ పెళ్లి చేసుకుంటున్న నితిన్... అమ్మాయి ఎవరంటే..

నితిన్ Photo : Twitter

నితిన్ Photo : Twitter

 హ్యాండ్ సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.

    హ్యాండ్ సమ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అదీ కూడా ప్రేమ పెళ్లి.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని సమాచారం. కొంత కాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ ఆమెను పెళ్లిచేసుకోనున్నారట. అయితే నితిన్ ప్రేమించిన ఆ అమ్మాయి చిత్ర పరిశ్రమకు చెందినవారు కాదని తెలుస్తోంది. వీరి పెళ్లి పెద్దల సమక్షంలో వచ్చే ఏడాది  సమ్మర్‌లో జరుగనున్నదని సన్నిహితుల సమాచారం. కాగా ఈ ఏడాది నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ గ్యాప్‌లో కథలు విన్న నితిన్ ఒకేసారి నాలుగు చిత్రాలు ప్రకటించాడు. ఆయన ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భీష్మలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇటీవలే ఓ రొమాంటిక్ టీజర్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. నితిన్ మరో సినిమా రంగ్ దే . ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. నితిన్ మూడవ సినిమాను  చంద్ర శేఖర్ ఏలేటితో  చేస్తున్నాడు. నాలుగవది కృష్ణ చైతన్య అనే దర్శకుడితో  చేస్తున్నాడు.
    కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్..
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Nithiin, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు