Home /News /movies /

ACTOR NASSAR MET AN ACCIDENT AT HIS LATEST MOVIE SHOOTING SLB

Actor Nassar: షూటింగ్‌లో ప్రమాదం.. గాయపడ్డ నటుడు నాజర్

Nassar Photo/ Twitter

Nassar Photo/ Twitter

Actor Nassar Accident: తాజాగా ఓ మూవీ షూటింగ్‌లో సీనియర్ నటుడు నాజర్ (Nassar) గాయపడ్డారు. సినిమా షూటింగ్ చేస్తుండగా ఆయనకు చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఈ మధ్యకాలంలో పలువురు నటులు షూటింగుల్లో గాయపడటం తరచుగా చూస్తున్నాం. రిస్కీ సీన్స్ చేస్తూ నటీనటులు గాయాల పాలవుతున్నారు. తాజాగా ఓ మూవీ షూటింగ్‌లో సీనియర్ నటుడు నాజర్ (Nassar) గాయపడ్డారు. సినిమా షూటింగ్ చేస్తుండగా ఆయనకు చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఓ తమిళ మూవీ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనను కొన్ని గాయాలైనట్లు సమాచారం అందింది. ఓ సీన్‌లో భాగంగా మెట్లు దిగుతున్న సందర్భంగా కాలు జారి ఆయన కింద పడ్డారట.

ఈ ప్రమాదంలో ఆయనకు కొన్ని గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు. ఎడమ కన్ను కింద భాగంలో స్వల్పంగా గాయం కావడంతో రక్తస్రావం జరిగిందట. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారట. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారట. నాజర్‌తో పాటు సుహాసిని, మెహ్రీన్, షియాజీ షిండే కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఒక సీరియస్ సన్నివేశంలో మెట్లపై నుంచి దిగి రావాల్సి ఉండగా ఆయన చకచకా వస్తూ ఉండడంతో అనుకోకుండా కాలు స్లిప్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరమే లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించారు. అనేక చిత్రాల్లో ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వెండితెరపై ఎంతగానో అలరిస్తూ వస్తున్నారు. యాక్టర్ గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు నాజర్.

మొన్నటికి మొన్న ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరిగింది కానీ ఆయన మాత్రం తన సినిమాలను చేస్తూ వెళ్తున్నారు. ఈ ప్రమాదంతో కొద్దిరోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకొని తిరిగి సెట్స్ మీదకు రానున్నారట. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Nassar, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు