• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTOR NANI SPECIAL SCREENING UPPENA FOR KRITHI SHETTY SHYAM SINGHA ROY CREW MNJ

Uppena- Nani: వారందరి కోసం ఉప్పెన స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయించిన నాని.. కారణం ఏంటంటే

Uppena- Nani: వారందరి కోసం ఉప్పెన స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయించిన నాని.. కారణం ఏంటంటే

నాని

Uppena- Nani- Krithi Shetty: వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా బుచ్చిబాబు స‌న తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన మొద‌టి షో నుంచి ఈ మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    Uppena- Nani- Krithi Shetty: వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా బుచ్చిబాబు స‌న తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన మొద‌టి షో నుంచి ఈ మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు క‌లెక్ష‌న్ల‌లోనూ దూసుకుపోతోంది. హీరో, హీరోయిన్, ద‌ర్శ‌కుడు ముగ్గురు కొత్త వారే అయిన‌ప్ప‌టికీ.. ఇందులో విజ‌య్ సేతుప‌తి భాగం అవ్వ‌డం, దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌డంతో మొద‌టి నుంచి ఉప్పెన‌పై అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేట‌ర్ల‌లో చేస్తోన్న సంద‌డిని చూసి నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా ఖుషీ అవుతున్నారు. క‌రోనా నేప‌థ్యంలో దాదాపుగా ఏడాది పాటు ఈ మూవీ విడుద‌ల వాయిదా ప‌డ‌గా.. ఇప్పుడు ఉప్పెన‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఊహించిన విజ‌యాన్ని అందుకున్నారు.

    కాగా ఈ మూవీని కోల్‌క‌తాలో స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయించారు నాచుర‌ల్ స్టార్ నాని. అక్క‌డ ప్ర‌స్తుతం నాని శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి కూడా న‌టిస్తుండ‌గా.. కోల్‌క‌తాలో షూటింగ్‌లో ఆమె కూడా పాల్గొంది. ఈ క్ర‌మంలో ఆమెకు తన మొదటి సినిమాను చూసే అవకాశం కల్పించడం కోసం ప్ర‌త్యేక స్క్రీనింగ్ వేయించారు నాని. ఈ విష‌యాన్ని కృతి శెట్టి సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది.



    కోల్‌క‌తాలో నా కోసం, శ్యామ్ సింగ రాయ్ టీమ్ కోసం ఉప్పెన స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయించిన నాని గారికి థ్యాంక్యు. ఈ మూవీని ఇష్ట‌ప‌డ్డా. ఇది నాకు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది అని కామెంట్ పెట్టారు.



    మ‌రోవైపు ఉప్పెన సినిమాపై నాని కూడా రివ్యూ ఇచ్చారు. ఉప్పెన ఒక బ్యూటీ. విజ‌య్, వైష్ణ‌వ్, కృతి, బుచ్చిబాబు, దేవి, మైత్రీ. మీ అంద‌రికీ థ్యాంక్స్. ఇది నా హృద‌యాన్ని తాకింది అని నాని సోష‌ల్ మీడియాలో కామెంట్ పెట్టారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు