Nani : బయట ఎక్కడో ఉన్నాడు.. ఉండకూడదు.. : సింగరేణి కాలనీ ఘటనపై నాని తీవ్ర స్వరం..

Nani Photo : Twitter

Nani : హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ముక్కుపచ్చలారని చిన్నారిపై దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నటుడు నాని తీవ్ర స్వరంతో స్పందించారు. దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 • Share this:
  హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారిపై జరిగిన ఆ ఘటన ఎందరినో కలిచివేసింది. ఘటనకు కారకుడైన నీచుడుని పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ఆ చిన్నారికి, ఆ కుటుంబానికి మద్దతుగా పలు సినీ సెలెబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా పోస్టులను చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా నటుడు నాని (Nani )స్పందించారు. తెలంగాణ పోలీసు పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ.. వాడు బయటెక్కడో ఉన్నాడు వాడు ఉండకూడదు చంపెయ్యల్సిందే అన్నట్టుగా స్పందించారు నాని. నిందితుడిని పట్టుకుంటే హైదరాబాద్ పోలీస్ భారీ నజరానా కూడా ప్రకటించారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీ (Singareni Colony Girl Incident )లో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ ముప్పై ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

  ఆ తర్వాత ఆ చిన్నారిని హత్య చేసి చంపేశాడు. వినాయక చవితి నాడు జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే ఇంతవరకు నిందితుడి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ ఘటనపై ఇప్పటికే సామాన్యుల నుంచి సెలెబ్రీటీస్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నింధితుడిని కఠినంగా శిక్షించాలనీ కోరుతున్నారు.


  ఇక తాజాగా ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  స్పందించారు. మహేష్ కూడా తీవ్ర స్వరంతో స్పందిస్తూ.. సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన ఘటన చూశాక మన సమాజం ఎంత నీచానికి దిగజారిందన్న దానిని గుర్తు చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనల వలన ఆడపిల్లలు ఉన్న కుటుంబాలలో తమ పిల్లలు సురక్షితంగా ఉంటారా అన్న ప్రశ్న ఎల్లప్పుడూ వారిలో మెదలుతూ ఉంటుంది.

  ఆ చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖ సముద్రంలో మునిగిపోయిందో ఊహించలేమని మహేష్ బాబు భావోద్వేగం చెందారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరుతూ నిందితుడిని త్వరగా పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలనీ, చిన్నారికి ఆమె కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.

  ఇక ఇదే సైదాబాద్‌ బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు సినీనటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) కోరారు. తాజాగా ఆయన సింగరేణి కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్‌ కోరారు. ఈ దారుణం జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా.. నిందితుడి ఆచూకీ తెలియట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాపై మండిపడ్డారు.

  అనవసమైన విషయానులను చూపించే మీడియా.. ఈ ఘటనపై సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నారు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చారు. ఆడపిల్లలను గౌరవించే విషయంపై ఎప్పటికప్పుడూ అవగాహన కల్పించాలనీ కోరారు.
  Published by:Suresh Rachamalla
  First published: