బిగ్ బాస్ భామ విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేసిన నటుడు నందు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ వీతిక శేరు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన నటుడు నందు ఈరోజు సైదాబాద్ SBH కాలనీలో మొక్కలు నాటాడు.

news18-telugu
Updated: June 24, 2020, 12:57 PM IST
బిగ్ బాస్ భామ విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేసిన నటుడు నందు..
మొక్కలు నాటుతున్న నందు
  • Share this:
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ వితిక శేరు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన నటుడు నందు ఈరోజు సైదాబాద్ SBH కాలనీలో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా హీరో నందు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని అందులో భాగంగా నీను కూడ భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా సవారీ చిత్రం యూనిట్ బృందం సభ్యులు అయిన హీరోయిన్ ప్రియాంక శర్మ, దర్శకుడు సాహితి మోత్కూరి, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, శ్రీకాంత్, జీవన్‌లను మొక్కలు నాటాలని కోరుతూ వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వతహాగా ఎవరికివారు మనిషికి ఒక మొక్కైనా నాటాలంటూ పిలుపునిచ్చాడు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ కాలనీ వాసులు పాల్గోన్నారు.
First published: June 24, 2020, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading