ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని బాటలో నాగ చైతన్య... కొంచెం కొత్తగా..

Naga Chaitanya : ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమా కోసం మాటలు వినపడని వ్యక్తి పాత్రలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజగా అక్కినేని హీరో నాగ చైతన్య కూడా కంఫర్ట్ జోన్ వదిలి.. కొంచెం కొత్తగా నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

news18-telugu
Updated: August 17, 2019, 3:31 PM IST
ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని బాటలో నాగ చైతన్య... కొంచెం కొత్తగా..
Photo : twitter
  • Share this:
Naga Chaitanya : ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు వైవిధ్యమైన పాత్రలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమా కోసం మాటలు వినపడని వ్యక్తి పాత్రలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అలాగే రవితేజ కూడా 'రాజాదిగ్రేట్' సినిమాలో కళ్లు కనపడని వ్యక్తిగా నటించాడు. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 'జైలవకుశ' చిత్రంలో మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించి దుమ్మురేపాడు. పూరీ జగన్నాథ్ తాజా సినిమా 'ఇస్మార్ట్ శంకర్‌'లో రామ్ కూడా తెలంగాణ యాసలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ కూడా పూరి దర్శకత్వంలో అలాంటీ ఓ వినూత్న పాత్రలో కనిపించనున్నాడు. పూరీ సొంత నిర్మాణంలో వచ్చే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.. మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా నటించనున్నాడని టాక్.
ఇప్పుడు నాగచైతన్య కూడా అలాంటి ఓ ప్రయోగం చేయనున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనపడబోతున్నారు. దీని కోసం ఆయన తెలంగాణ యాసను ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. ఆగస్ట్ చివరి వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. నారాయణ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావ్ నిర్మిస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: August 17, 2019, 3:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading