HOME »NEWS »MOVIE »actor naga chaitanya doing another remake film after premam

'బరైలీ కీ బర్ఫీ' రీమేక్‌లో నాగచైతన్య

'బరైలీ కీ బర్ఫీ' రీమేక్‌లో నాగచైతన్య
Actor Naga Chaitanya doing another remake film after Premam

అక్కినేని నాగచైతన్య ఈ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతున్నారు. ఆయన తాజా సినిమాలు 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' అనుకున్నంతగా ఆడలేదు. దీంతో నెక్ట్స్ చేసే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

  • Share this:
    అక్కినేని నాగచైతన్య ఈ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతున్నారు. ఆయన తాజా సినిమాలు 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' కూడా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో నెక్ట్స్ చేసే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు నాగచైతన్య. దానిలో భాగంగా కొత్త కథలకన్న వేరే భాషల్లో హిట్ అయిన సినిమాల వైపు చూస్తున్నాడు.

    అందులో భాగంగా హిందిలో బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించిన 'బరైలీ కీ బర్ఫీ' సినిమాను ఎంచుకున్నట్లు సమాచారం. 'బరైలీ కీ బర్ఫీ' చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అశ్విని అయ్యర్‌ తివారి దర్శకుడు. ఈ సినిమాను తెలుగులో  నాగచైతన్య హీరోగా,  ప్రముఖ రచయిత కోనవెంకట్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.



    బరైలీ కీ బర్ఫీ' చిత్రం  ట్రైలర్‌ను ఇక్కడ చూడోచ్చు.

    Published by:Suresh Rachamalla
    First published:January 02, 2019, 00:13 IST