విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు.. హీరో ఎవరంటే

తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. తాజాగా మోహన్ బాబు తమిళ్‌లో ఒక స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది.

news18-telugu
Updated: June 13, 2019, 4:10 PM IST
విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు.. హీరో ఎవరంటే
మోహన్ బాబు ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. ఆ మధ్య ఈ నటప్రపూర్ణుడు కథానాయకుడిగా నటించిన ‘గాయత్రి’ మూవీ రిలీజైన సంగతే ఆడియన్స్‌కు తెలియదు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ మూవీలో ఎస్వీఆర్ పాత్రలో నటించి మెప్పించారు. అయినా ఈ మూవీ సక్సెస్‌ క్రెడిట్ మాత్రం మోహన్ బాబుకు దక్కలేదు. ప్రస్తుతం ఈ కలెక్షన్ కింగ్ ఒక తమిళ సినిమాకు సైన్ చేసినట్టు కోలీవుడ్ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజగా ఆ వార్తల్ని నిజం చేస్తూ..మోహన్ బాబు ఈ సినిమాకు సైన్ చేశాడు. అంతే కాకుండా ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన కూడ వెలువడింది. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.  ఆల్రెడీ సుధ కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘ఇరుదు సుట్రు’ మూవీని హిందీలో మాధవన్‌తో ‘సాలా ఖడూస్’గా తెరకెక్కించి మంచి మార్కులే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘గురు’ టైటిల్‌తో రీమేక్ చేసి మంచి సక్సెసే అందుకుంది.

మోహన్ బాబు, సూర్య


తెలుగమ్మాయి అయిన సుధ కొంగర...త్వరలో సూర్యతో తెరకెక్కించబోయే సినిమాలో బలమైన విలన్ మాత్రం కోసం మోహన్ బాబును తీసుకోవాలని ఫిక్స్ అయిందంట. ఆల్రెడీ కథ రాసుకున్నపుడు ఈసినిమాలో అతి ముఖ్యమైన పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందని అనుకుందని చెబుతున్నాయి సినీ వర్గాలు. ఇదే విషయాన్ని సూర్యకు కూడా చెప్పిందట. దానికి సూర్య కూడా ఈ పాత్ర మోహన్ బాబు అయితే బాగుంటుందని చెప్పాడట.  రీసెంట్‌గా సుధ కొంగర..మోహన్ బాబును కలిసి ఈ సినిమా స్టోరీ వినిపించింది. దానికీ నట ప్రపూర్ణుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  మొత్తానికి చాలా రోజుల తర్వాత విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు ఈ సినిమాతో ఎలాంటి విలనిజాన్ని చూపెడతాడో చూడాలి.


Published by: Suresh Rachamalla
First published: June 13, 2019, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading