ACTOR MOHAN BABU MAY JOIN YS JAGAN MOHAN REDDY YSR CONGRESS PARTY TA
వైసీపీ అధినేత జగన్ను కలిసిన మోహన్ బాబు.. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా..
మోహన్ బాబు, వైయస్ జగన్మోహన్ రెడ్డి
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు తమకున్న క్షేత్ర పరిస్థితులను బట్టి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. తాజాగా నట ప్రపూర్ణ మోహన్ బాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లో కలవడం ప్రాధాన్యా సంతరించుకుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు తమకున్న క్షేత్ర పరిస్థితులను బట్టి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. ఇందుకు సినిమా యాక్టర్స్ మినహాయింపు కాదు. ఎన్నికల తేది దగ్గర పడే కొద్ది పలువురు నటులు తమ రాజకీయా భవిష్యత్తు వెతుక్కూంటూ ఆయా పార్టీల్లో చేరుతున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఈ సినీ నటుల తాకిడి కొంచెం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా సినిమా తారలు సినీ గ్లామర్ ఎక్కువగా ఉన్న టీడీపీ, జనసేనను కాదని వైసీపీ బాట పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధిపతి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్సీపీలో జాయన్ కానున్నరని సమాచారం.అంతేకాదు లోటస్ పాండ్లో ఉన్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. దీంతో మోహన్ బాబుతో పాటు ఆయన తనయుడు మంచు విష్ణు ఆ పార్టీలో చేరతారన్న రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తిరుపతిలో మోహన్ బాబు
మోహన్ బాబు వైసీపీలో చేరుతారా లేకపోతే ఈ పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తరా అనేది చూడాలి. రీసెంట్గా శ్రీవిద్యానికేతన్ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడతూ ఆయన రోడ్డెక్కిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఆయన వైసీపీ అధినేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహేష్ బాబు మైనపు విగ్రహం
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.