సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు తమకున్న క్షేత్ర పరిస్థితులను బట్టి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. ఇందుకు సినిమా యాక్టర్స్ మినహాయింపు కాదు. ఎన్నికల తేది దగ్గర పడే కొద్ది పలువురు నటులు తమ రాజకీయా భవిష్యత్తు వెతుక్కూంటూ ఆయా పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధిపతి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. జగన్ ఆయన్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల నామినేషన్ ముగిసిన అనంతరం మోహన్ బాబు..వైసీపీలో జాయిన్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో మోహన్ బాబుకు జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.అధినేత ఆదేశిస్తే.. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తానన్నారు. అంతేకాదు తాను ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీలో బేషరుతుగా జాయిన్ అయినట్టు చెప్పుకొచ్చారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల ముందుర మోహన్ బాబు.. వైసీపీ తీర్థం పుచ్చుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మహేష్ బాబు మైనపు విగ్రహం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Manchu Family, Mohan Babu, Tdp, Ys jagan, Ysrcp