హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: ట్రోలింగ్‌పై మంచు విష్ణు సీరియస్.. ఆ నటుడు ఎవరు ?

Manchu Vishnu: ట్రోలింగ్‌పై మంచు విష్ణు సీరియస్.. ఆ నటుడు ఎవరు ?

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

Tollywood: ఈ విషయంలో మంచు విష్ణు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయన చెప్పినట్టుగా తమపై ట్రోలింగ్స్‌కు పాల్పడుతున్న నటుడి పేరు పోలీసుల విచారణలో బయటపడుతుందా ? అన్న ఆసక్తి నెలకొంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తమపై ట్రోలింగ్ చేసే వారిపై మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఈసారి చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. గతంలో ఈ ట్రోలింగ్ చేసే వారికి కౌంటర్ ఇచ్చి ఊరుకున్న మంచు విష్ణు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు. తమపై ట్రోలింగ్ చేస్తున్న 18 యూట్యూబ్(Youtube)  ఛానళ్లను కనిపెట్టామని.. వారిపై కేసు పెట్టబోతున్నామని అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇందుకు సంబంధించి రెండు ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేశామని.. వాటికి ఓ టాలీవుడ్ (Tollywood) నటుడికి సంబంధం ఉందని మంచు విష్ణు(Manchu Vishnu) కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఐపీ అడ్రస్‌లకు సంబంధించి ఆఫీసులు ఎక్కడున్నాయనే విషయాన్ని చెప్పిన మంచు విష్ణు.. అవి ఏ నటుడికి చెందినవో మాత్రం చెప్పలేదు.

  సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలోనే ఈ విషయాలు వెలుగులోకి వస్తాయని మంచు విష్ణు చెప్పారు. అప్పుడు వారి పరువే పోతుందని కామెంట్ చేశారు. అయితే మంచు విష్ణు పదే పదే చెబుతున్న ఆ నటుడు ఎవరనే దానిపై ఇటు ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా మోహన్ బాబు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కొన్నాళ్ల క్రితం కోల్డ్ వార్ కొనసాగింది. మా అధ్యక్ష ఎన్నిక సమయంలో ఇది పీక్స్‌కు చేరుకుంది. దీంతో మంచు విష్ణు ప్రస్తావించిన ఆ నటుడికి మెగా ఫ్యామిలీకి ఏమైనా సంబంధం ఉందా ? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

  అయితే ఇది చాలా సీరియస్ అంశం కావడంతో.. ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయొద్దనే ఉద్దేశ్యంతోనే మంచు విష్ణు ఆ పేరు బయటపెట్టడం లేదని తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఎవరితో సంబంధం లేని వ్యక్తులు కూడా తమ ఛానల్‌ పాపులర్ అయ్యేందుకు ఇలాంటి వీడియోలను చేస్తుంటారు. దీంతో మంచు ఫ్యామిలీపై కూడా అలాంటి వాళ్లే ఇలాంటి పనులు చేస్తున్నారా లేక ఆయన చెప్పినట్టే ఓ నటుడికి ఈ ట్రోలింగ్స్‌తో సంబంధం ఉందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Manchu Vishnu: ట్రోలింగ్ పై మంచు విష్ణు సీరియస్.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు.. !

  కలర్స్ స్వాతి న్యూ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’.. టీజర్ అదుర్స్

  మరోవైపు ఈ విషయంలో మంచు విష్ణు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయన చెప్పినట్టుగా తమపై ట్రోలింగ్స్‌కు పాల్పడుతున్న నటుడి పేరు పోలీసుల విచారణలో బయటపడుతుందా ? అన్న ఆసక్తి నెలకొంది. మొత్తానికి గతంలో ట్రోలింగ్స్ విషయంలో చూసిచూడనట్టు వ్యవహరించిన మంచు విష్ణు.. ఇప్పుడు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవడం అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Manchu Vishnu

  ఉత్తమ కథలు