news18-telugu
Updated: April 21, 2020, 3:16 PM IST
మహేష్ బాబు నమ్రత (mahesh babu namrata)
మహేశ్ బాబు అంటే ఆయన భార్య నమ్రతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. మహేశ్ బాబు ఎక్కడికి వెళ్లినా... తోడుగా నమ్రత కూడా ఉంటుంది. సినిమా కథల సంగతి ఏమో కానీ... మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సహా పలు వ్యవహారాలను నమ్రత దగ్గరుండి చూసుకుంటారనే టాక్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా... మహేశ్ బాబును బాలీవుడ్‌కు కూడా పరిచయం చేయాలని నమ్రత ఎప్పటి నుంచో కలలు కంటోంది. అయితే మహేశ్ బాబు మాత్రం బాలీవుడ్ వద్దు... టాలీవుడ్ ముద్దు అంటూ ఆమె కోరికను ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పెడుతూ వస్తున్నాడు.
అయితే తాజాగా నమ్రత కోరిక తీరే సమయం దగ్గర పడుతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నానని దర్శకధీరుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. సినిమా ఎలా ఉండబోతోంది ? ఎప్పుడు మొదలవుతుందనే విషయాలు చెప్పకపోయినా... మహేశ్ బాబుతోనే తన నెక్ట్స్ మూవీ అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా చేశారు రాజమౌళి.

రాజమౌళి, మహేశ్ బాబు
ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో ఉంటుంది. అంటే మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా కూడా టాలీవుడ్, సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ విడుదల కావడం ఖాయం. అంటే ఈ రకంగా మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మొత్తానికి తన భర్త మహేశ్ బాబును బాలీవుడ్‌కు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న నమ్రత కోరిక రాజమౌళి ద్వారా తీరనుంది.
Published by:
Kishore Akkaladevi
First published:
April 21, 2020, 3:16 PM IST