హోమ్ /వార్తలు /సినిమా /

Raj Tarun: రాజ్ తరుణ్ ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటానన్నడు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..!

Raj Tarun: రాజ్ తరుణ్ ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటానన్నడు.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..!

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్

తాజాగా ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. రాజ్ తరుణ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాజ్ తరుణ్ తాాజాగా నటించిన అనుభవించు రాజా సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు.

  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో... రాజ్ తరుణ్(Raj Tarun). 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. సినిమాల్లోకి రాక ముందు అనేక షార్ట్ ఫిలింస్‌లో కూడా రాజ్ తరుణ్(Raj Tarun) నటించాడు. ఆ తర్వాత ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాల విజయాలతో వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ ఈ సినిమాల సక్సెస్ తో తన మార్కెట్ ను పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ చేసిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా అనుభవించు రాజా(Anubhavinchu Raja) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్‌కు ఆ సినిమా కూడా అశించినంత విజయం అందించలేదు.

  తాజాగా రాజ్ తరుణ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రముఖ నటుడు మధునందన్. మధునందన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్లు ఉంటారని ఆయన అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప మరేం లేదన్నారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో రాజ్ తరుణ్ తనకు కాల్ చేసి ఇంకో వన్ వీక్ లాక్ డౌన్ ను కొనసాగిస్తే సూసైడ్ చేసుకుంటానని అన్నాడన్నారు. తన పరిస్థితి అలా ఉందని ఒక్కడినే ఉన్నానని పిచ్చి పడుతోందని కామెడీగా చెప్పాడని మధునందన్(Madhunandan) అన్నారు. నా వల్ల కావడం లేదని ఏం చేయాలో తనకు తెలియడం లేదని రాజ్ తరుణ్ చెప్పాడని మధునందన్ కామెంట్లు చేశారు.


  నువ్వైనా మా ఇంటికి రా లేకపోతే నన్ను అయినా మీ ఇంటికి తీసుకొని వెళ్లు అని రాజ్ తరుణ్ తనతో చెప్పాడని మధునందన్ చెప్పుకొచ్చారు.రాజ్ తరుణ్ అలా ఫోన్ చేయడంతో మా ఫ్రెండ్ సహాయంతో రాజ్ తరుణ్ అడ్రస్ ఇచ్చి రాజ్ తరుణ్ ను తన ఇంటికి పిలిపించుకున్నానని మధునందన్ పేర్కొన్నారు. అలా తన ఇంటికి వచ్చిన రాజ్ తరుణ్.. మూడువారాల పాటు తనతో పాటే తన ఇంట్లో ఉన్నాడని చెప్పాడు. మొత్తం మీద రాజ్ తరుణ్‌కు సంబంధించిన ఈ విషయాలు మధునందన్ చెప్పడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Raj tarun, Tollywood, Uyyala jampala

  ఉత్తమ కథలు