Home /News /movies /

ACTOR MADHU NAMBIAR INTERESTING COMMENTS ON SITA RAMAM MOVIE SB

Sita Ramam: సీతారామం సంతృప్తి ఇచ్చిందన్న .. మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి

Sita Ramam: సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు నంబియార్. ఇప్పటికి 20 చిత్రాల్లో చేశాననీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషీ" చిత్రంలోనూ నటిస్తున్నానని తెలిపారు.

Sita Ramam: సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు నంబియార్. ఇప్పటికి 20 చిత్రాల్లో చేశాననీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషీ" చిత్రంలోనూ నటిస్తున్నానని తెలిపారు.

Sita Ramam: సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు నంబియార్. ఇప్పటికి 20 చిత్రాల్లో చేశాననీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషీ" చిత్రంలోనూ నటిస్తున్నానని తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    "సీతారామం" (Sita Ramam) చిత్రం నటుడిగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోందన్నా ఇంటరాగేషన్ ఆఫీసర్ పాత్రధారి మధు నంబియార్(Madhu Nambiyar) . ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందననూ , విమర్శకుల ప్రశంసలనూ పొందుతోన్న "సీతారామం" (Sita Ramam) చిత్రం అందులోని నటీ నటులకు విశిష్టమైన గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఇదే విషయమై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ "సీతారామం" వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు నంబియార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి వచ్చి నటుడిగా మారిన తనకు "సీతారామం"లో ఇంటరాగేషన్ ఆఫీసర్ వంటి పాత్ర లభించడం, చిన్న పాత్రే అయినా సంతృప్తి నిచ్చిందన్నారు.

    రష్మిక సుమంత్ ల కాంబినేషన్ లో చేసిన కీలక సన్నివేశం కావడంతో - ఆ క్యారెక్టర్ గురించి బంధువులు, స్నేహితులు, సన్నిహితులే కాక చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసిస్తూ ఉండడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని అంటున్నారు మధు నంబియార్. ఈ సందర్భంగా తనకు "సీతారామం"లో మంచి పాత్రనిచ్చి ప్రోత్సహించిన నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, ప్రియాంక దత్ గార్లకీ, దర్శకుడు హను రాఘవపూడికి, దర్శకత్వ శాఖకు చెందిన రవితేజ చెరుకూరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు మధు నంబియార్.


    "సీతారామం"తో పాటుగా ఈ మధ్య వచ్చిన "సర్కారువారి పాట", "గంధర్వ", "దర్జా" తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన నంబియార్ ఇప్పుడు మాత్రం కథలో ప్రాధాన్యత వున్న పాత్రలే దక్కుతున్నాయని అంటున్నారు. ఇప్పటికి 20 చిత్రాల్లో చేశాననీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ - సమంతల "ఖుషీ" చిత్రంలోనూ, బసవరామ తారకం ఆర్ట్స్ పతాకంపై వస్తోన్న నందమూరి చైతన్య కృష్ణ చిత్రంలోనూ, మరో మూడు సినిమాల్లోనూ, ఒక తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలోనూ, ఓ వెబ్ సిరీస్ లోనూ మంచి పాత్రలు పోషిస్తోన్నట్లు చెప్పారు.

    అలాగే ప్రధాన చిత్రాలతో పాటు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు జోరుగా సాగుతోన్న ప్రస్తుత తరుణం తనవంటి ఎందరో నటీ నటులకు వరంగా మారిందనీ, విరివిగా అవకాశాల్ని అందిస్తోందన్నారు. ప్రేక్షకులు కూడా పాత్రలకు తగ్గ నటీ నటులనే ఆదరిస్తూ ఉండడం తనలాంటి ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా నిలుస్తోందని చెప్పారు. ప్రేక్షకుల చేత విలక్షణమైన నటుడిననీ, పరిశ్రమ చేత క్రమశిక్షణ కలిగిన నటుడిననీ అనిపించుకోవడమే తన లక్ష్యమన్నారు మధు నంబియార్. ఇక ఆగష్టు 5న అభిమానుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Indian Air Force, Sita Ramam, Tollywood

    తదుపరి వార్తలు