సినిమా ఇండ్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటికే క్యాన్సర్‌తో పోరాడుతున్న నటుడికి కరోనా సోకింది. దీంతో ఆరోగ్యం విషమించి అతడు ప్రాణాలు కోల్పోయాడు. 30 ఏళ్లకే యువనటుడు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రముఖ నటుడు కిషోర్ దాస్.. కరోనా సోకండంతోనే మృతి చెందాడని, అతడిని కాపాడడానికి తమ శాయశక్తులా ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. కిషోర్ మరణం ప్రస్తుతం అస్సాంలో సంచలనం సృష్టిస్తోంది. పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకుండానే కిషోర్ మృత్యువాత పడడం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అతడి అంత్యక్రియలు చెన్నైలోనే నిర్వహించనున్నారు.
కరోనా సోకడంతో అతడి స్వస్థలానికి బాడీని పంపించబోయేది లేదని వైద్యులు తెలిపారు. దీంతో తమ అభిమాన నటుడు చివరి చూపుకు కూడా అభిమానులు నోచుకోలేకపోవడం విచారకరం. ఇక కిషోర్ మరణవార్త విన్న పలువురు ప్రముఖులు అతడికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం, కిషోర్ దాస్ క్యాన్సర్‌తో బాధపడటమే కాకుండా అతనికి కోవిడ్ కూడా వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలు మరింత పెరిగాయి. దీంతో చివరకు అతడు ప్రాణాలు విడిచాడు. కిషోర్ దాస్ మరణ వార్త విన్న అభిమానులు, పలువురు నటులు అతడికి తడి కళ్లతో నివాళులు అర్పించారు. కిషోర్ దాస్ మృతి పట్ల అభిమానులు సైతం సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అస్సామీ నటుడు కిషోర్ దాస్ క్యాన్సర్ నాలుగో దశకు చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. కొంత కాలం గౌహతిలో కూడా చికిత్స పొందారు. నటుడు గత నెలలో ఆసుపత్రి నుండి ఒక చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అందులో అతను ఆసుపత్రి బెడ్‌పై కనిపించాడు. గత నెల, కిషోర్ దాస్ ఆసుపత్రి నుండి ఒక ఫోటోను పంచుకున్నారు. ఫోటోను షేర్ చేస్తున్నప్పుడు, ఇది క్యాప్షన్‌లో వ్రాయబడింది- 'మిమ్మల్ని చంపనిది మిమ్మల్ని బలపరుస్తుంది. ఇది కీమోథెరపీ యొక్క నాల్గవ దశ. ఇది సులభం అని మీరు అనుకుంటారు కానీ అలా ఉండదు. నేను అలసట, వికారం, మైకము, బలహీనత, వాంతులు వంటి దుష్ప్రభావాలు పొందుతున్నాను.
డాక్టర్ని సంప్రదించకుండా నేను ఏ ఇతర ఔషధం తీసుకోలేను. నేను బాగానే ఉంటానని ఆశిస్తున్నాను. అదే సమయంలో, చికిత్స పూర్తయిన తర్వాత, కణితి గణనీయంగా తగ్గుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. మీ ప్రార్థనలలో నన్ను గుర్తుంచుకోండి.అంటూ పోస్టు చేశారు. ఇప్పుడు ఈపోస్టు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది. కిషోర్ దాస్ చాలా మ్యూజిక్ వీడియోలలో పనిచేశాడు. దీంతోపాటు 'ఇండియాస్ గాట్ టాలెంట్', 'డాన్స్ ఇండియా డ్యాన్స్'లో కూడా పాల్గొన్నాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.