Home /News /movies /

ACTOR KALYAN DEV MOVIE KINNERAANI MOVIE RELEASED ON OTT ZEE5 ON JUNE 10TH SB

Kinnerasani: నేరుగా ఓటీటీలోకి వస్తున్న... చిరంజీవి చిన్నల్లుడు సినిమా..!

కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని సినిమా (Kinnerasani movie)

కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని సినిమా (Kinnerasani movie)

ఈ సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనుకుంటున్నారు.

    కల్యాణ్‌ దేవ్‌  (Kalyan Dev) హీరోగా నటించిన క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘కిన్నెరసాని’(Kinnerasani). రమణ తేజ దర్శకుడు. రామ్‌ తళ్లూరి నిర్మించారు. అన్‌ షీతల్‌, మహతి భిక్షు, కశిష్‌ ఖాన్‌ నాయికలు. రవీంద్ర విజయ్‌ కీలక పాత్ర పోషించారు. విజేత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు హీరో కళ్యాణ్ దేవ్. ఇటీవల సూపర్ మచ్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆశిచినంతస్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కిన్నెరసాని. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    కిన్నెరసాని (Kinnerasani) సినిమాకు డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ప్రసాద్ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో(OTT) రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

    మన నిజ జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతిబింబంలా ఉంటుందీ కథ. వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ మహతి భిక్షు. మహతి స్వర సాగర్‌ కిన్నెరసాని సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kalyan dev, Megastar Chiranjeevi

    తదుపరి వార్తలు