ఇస్లాం మతం పుచ్చుకున్న హీరో... త్వరలోనే పేరు కూడా మార్పు

తాను ఏడేళ్లుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నానని తెలిపాడు. దీనికి తన ఇంట్లో కూడా ఎవరూ అడ్డుకోలేదన్నాదు.

news18-telugu
Updated: December 22, 2019, 9:33 AM IST
ఇస్లాం మతం పుచ్చుకున్న హీరో... త్వరలోనే పేరు కూడా మార్పు
హీరో జై
  • Share this:
ఓవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త కొత్త బిల్లులతో దేశవ్యాప్తంగా ముస్లీంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో తాను ఇస్లాం మతం స్వీకరించిన మాట వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు తమిళ హీరో జై. త్వరంలోనే పేరు కూడా మార్చుకుంటానన్నారు. దీంతో హీరో జై మత మార్పిడిపై కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. తన కొత్త చిత్రం 'కేప్ మారి' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన జై... తాను ఏడేళ్లుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నానని తెలిపాడు. దీనికి తన ఇంట్లో కూడా ఎవరూ అడ్డుకోలేదన్నాదు. ఏ దేవుడినీ నమ్మని తాను, ఏదో ఒక దేవుడిని నమ్మడమే వారికి సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.

మతం మారినా, ఇంతవరకూ పేరును మార్చుకోలేదని, త్వరలోనే పేరు కూడా మార్చుకుంటానని చెప్పాడు. అయితే తన పేరును అజీస్‌ జై అని పెట్టుకోవాలని జై భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'జర్నీ' తదితర చిత్రాలతో జై ... టాలీవుడ్ ప్రేక్షకులకూ కూడా దగ్గరయ్యారు.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు