శ్రీముఖిపై సంచలన ఆరోపణలు చేసిన నటి హేమ

ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన హేమ బిగ్ బాస్ రియాల్టీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ ఆమె కాంట్రోవర్సీ కామెంట్స్ చేశారు.

news18-telugu
Updated: October 24, 2019, 4:40 PM IST
శ్రీముఖిపై సంచలన ఆరోపణలు చేసిన నటి హేమ
తాను స్ట్రాంగ్ కాబట్టి ముందు తనను బయటికి పంపేసారని.. ఇకపై సాఫ్ట్ వాళ్లందర్నీ ఒక్కొక్కరుగా బయటికి పంపేస్తారని చెబుతుంది హేమ. ఇక సినిమాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతుంది హేమ. వైసీపీలో చేరిపోతానేమో.. జగన్ అంటే తనకు ఇష్టం అని చెబుతుంది ఈ నటి.
  • Share this:
టాలీవుడ్ నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రారంభంలోనే ఎలిమినెట్ అయిపోయారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న హేమ వారం తిరగకుండానే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. బయటకొచ్చిన తర్వాత హేమ బిగ్ బాస్ షోపై అక్కడక్కడ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన హేమ బిగ్ బాస్ రియాల్టీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ ఆమె కాంట్రోవర్సీ కామెంట్స్ చేశారు.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత... హిమజ ఎలిమినేట్ అయ్యేంతవరకూ మాత్రమే ఎపిసోడ్ చూశానన్నారు హేమ.

ఎందుకంటే మిగతా వాళ్లంతా ఒక గ్రూప్ అంటూ హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరి మధ్య ఒక ఒప్పందమనేది ముందుగానే జరిగిపోయిందన్నారు. శ్రీముఖి పుట్టిన రోజున ఆ గ్రూప్ అంతా సమావేశమై తనను ముందుగా హౌస్ నుంచి బయటకు పంపించేయాలని స్కెచ్ వేశారన్నారు. లేదంటే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతుందని శ్రీముఖి బ్యాచ్ అంతా భావించిందన్నారు హేమ. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే తనను కావాలని రెచ్చగొట్టారని విమర్శలు గుప్పించారుజ వాళ్ల ప్లాన్ తెలియన తాను తన స్టైల్లో సమాధానం చెప్పడంతో ఎలిమినేషన్ లోకి వచ్చేయడం జరిగిపోయిందన్నారు హేమ. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగియనుంది. మరి ఇలాంటి సమయంలో హేమ చేసిన వ్యాఖ్యలు బిగ్ బాస్ విన్నర్‌ విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సిందే.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>