హోమ్ /వార్తలు /సినిమా /

జగన్‌పై ఆ దుష్ప్రచారం నా పని కాదు.. వాని బొక్కలు ఇరగ్గొట్టిస్తా : ఫిష్ వెంకట్

జగన్‌పై ఆ దుష్ప్రచారం నా పని కాదు.. వాని బొక్కలు ఇరగ్గొట్టిస్తా : ఫిష్ వెంకట్

వైఎస్ జగన్, ఫిష్ వెంకట్(File)

వైఎస్ జగన్, ఫిష్ వెంకట్(File)

ఫిష్ వెంకట్ పేరుతో క్రియేట్ చేసిన ఆ ట్విట్టర్ ఖాతాలో ' మాకు మీలాగా సొంత బాబాయిని చంపడం తెలీదు. కోట్ల రూపాయలు కాజేయడం తెలియదు.ఈవీఎంతో సీఎం అవడం తెలియదు.' అనే పోస్టు పెట్టారు.

సోషల్ మీడియాలో తన పేరు మీద ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ సినీ నటుడు ఫిష్ వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిష్ వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేయగానే.. ఆయన పేరు మీద క్రియేట్ చేసిన

ఫేక్ ఖాతాను సదరు వ్యక్తులు తొలగించేయడం గమనార్హం.

కాగా, ఫిష్ వెంకట్ పేరుతో క్రియేట్ చేసిన ఆ ట్విట్టర్ ఖాతాలో ' మాకు మీలాగా సొంత బాబాయిని చంపడం తెలీదు. కోట్ల రూపాయలు కాజేయడం తెలియదు.ఈవీఎంతో సీఎం అవడం తెలియదు.' అనే పోస్టు పెట్టారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్ కావడంతో వైఎస్ జగన్ అభిమానులు ఆయనపై దుమ్మెత్తిపోశారు.ఫిష్ వెంకట్‌పై చాలా విమర్శలు చేశారు. విషయం ఫిష్ వెంకట్‌కి తెలియడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అంతకుముందు ట్విట్టర్‌లో ఫిష్ వెంకట్ ఓ వీడియోను పోస్టు చేసి దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. తాను,తన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబానికి వీరాభిమానులం అని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం కావాలని కలలు కన్నవాళ్లలో తమ కుటుంబం కూడా ఉందని.. అలాంటిది జగన్‌పై తానెందుకు విమర్శలు చేస్తానని అన్నారు. తన పేరుతో ఇలాంటి దుష్ప్రచారానికి దిగిన వ్యక్తి బొక్కలు ఇరగ్గొట్టిస్తానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

First published:

Tags: Ys jagan

ఉత్తమ కథలు