గత కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సినీ నటులతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నాడు. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. రీసెంట్‌గా ప్రముఖ బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్.. తండ్రి వీరూ దేవ్‌గణ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ల కుటుంబానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ (79) మృతికి ప్రధాన మంత్రి సంతాపం వ్యక్తం చేసారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ‘చోరి చోరి చుప్కే చుప్కే’, ‘దమ్ దమా దమ్’,బాద్‌షా’,‘ఖిలాడీ’ వంటి ఎన్నో చిత్రాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను అలరించారాయన. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో కూడా గౌరవించింది. ఈ సంద్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేసారు.
దిన్యర్ కాంట్రాక్టర్ హాస్యానికి హిందీ చిత్ర పరిశ్రమ ఫిదా అయింది. ఆయన హాస్యం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ అలరించేది.

బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ మృతి
థియేటర్, టీవీ, సినిమా ఇలా ఎక్కడ చూసిన తనదైన హాస్యంతో వెండితెరను, చిన్నతెరను నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా దిన్యర్‌తో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు ప్రధాని మోదీ.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 05, 2019, 13:19 IST