తమిళ స్టార్ హీరో ధనుష్ సంచలన పోస్ట్ చేశారు. ధనుష్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అటు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు షాక్‌కు గురైయ్యారు. ధనుష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యని 2004లో పెళ్లి చేసుకున్నారు. గత 18 ఏళ్లకు కలిసి ఉంటున్న ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భార్యతో విడిపోవడానికి కారణం మాత్రం తెలుపలేదు నటుడు ధనుష్. ఆయన విడుదల చేసిన నోట్లో రాస్తూ.. ‘ మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా , కలిసి బ్రతికాం.. అనుకోని కారణాల వల్ల ఈరోజు మీము విడిపోయే పోతున్నాం. ఇది ఇద్దరం అనుకుని తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయాన్ని, మా గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము.. అని తెలిపారు ధనుష్. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆ నోట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. తమిళ నటుడు ధనుష్ (Dhanush) తెలుగులో ఇప్పటికే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ధనుష్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఆయన మరో తెలుగు దర్శకుడితో సినిమాను ఓకే అన్నారు. వెంకి అట్లూరితో ఆయన సర్ అనే సినిమాను చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల పూజా కార్యక్రమం కూడా జరిగింది. అంతేకాదు కొంత షూటింగ్ కూడా జరుపుకుంది టీమ్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
ఇక ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా విషయానికి వస్తే.. సున్నిత అంశాలతో ప్రేమకథ చిత్రాలను రూపోందించే శేఖర్ కమ్ముల ధనుష్‌ను ఎలాంటీ కథతో, అసలు ఏ నేపథ్యంలో చూపబోతున్నారన్న ఆసక్తి ధనుష్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు ఉంది. మామూలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అనగానే ఆ చిత్రం లవ్ జానర్లోనే ఉంటుందని దాదాపు అందరూ అనుకుంటారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ తాజా సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా ఒకప్పటి మద్రాసు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా టాక్ నడుస్తోందట.
ఆ కారణంగానే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం మొదట ధనుష్‌ని సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ కూడా దాదాపు పూర్తైనట్టు సమాచారం.నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ధనుష్ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ధనుష్ సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మన తెలుగు హీరోల వలే మూస పాత్రలు కాకుండా సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. అందులో భాగంగా వచ్చినవే.. అసురన్, కర్ణన్ సినిమాలు. దాదాపు ఆయన సినిమాలన్ని సామాన్యుల జీవితాల గురించే చర్చిస్తాయి.
ఇక శేఖర్ కమ్ముల సినిమాల విషయానికి వస్తే.. సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా లవ్ స్టోరి (Love Story). సాయి పల్లవి, (Sai Pallavi) నాగ చైతన్యలు (Naga chaitanya) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.