టాలీవుడ్లో యాక్టర్ కమ్ నిర్మాతగా బండ్ల గణేష్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయన టాలీవుడ్ అగ్ర హీరోలైన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి కథానాయకులతో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. నటుడిగా బిజీగా ఉన్న బండ్ల ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా రాజీ లేని మాటలతో రెచ్చిపోయాడు. సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ అంటూ ఈయన చేసిన రచ్చ ఇప్పటికీ మరిచిపోలేం. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు చెప్పి సంచలనం క్రియేట్ చేసాడు. నటుడిగా గ్యాప్ తీసుకున్న ఈయన చాలా రోజుల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మధ్య గబ్బర సింగ్ 8 ఏళ్లు కంప్లీటైన సందర్భంగా హరీష్ శంకర్, ఈయనకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. హరీష్ శంకర్ ఈ సినిమా ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా బండ్ల గణేష్ తప్పించి మిగతా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసాడు. ఇది బండ్ల గణేష్ కోపానికి కారణమైంది.
ఆ తర్వాత హరీష్ శంకర్ తన తప్పు తెలుసుకొని బండ్ల గణేష్‌కు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత ఇదే ఇష్యూపై బండ్ల గణేష్... ఇకపై హరీష్ శంకర్‌తో సినిమాలు చేయనని చెప్పాడు. అంతేకాదు హరీష్ శంకర్‌కు రీమేక్ సినిమాలు తప్పించి డైరెక్ట్‌గా చేసిని సినిమాలతో హిట్టు కొట్టలేడు అంటూ చేసిన వ్యాఖ్యలు వీళ్లిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. హరీష్ శంకర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఒకవేళ ఆయన డేట్స్ ఇస్తే.. సినిమా చేయడానిక ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఆయన తనకు అన్నతో సమానమన్నాడు. దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఆయన తనపై ఉన్న అభిప్రాయం మార్చుకున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Harish Shankar, Tollywood