బర్త్ డే విషెస్ చెప్పిన వారికి బాలయ్య ఏం చేసాడో తెలుసా..

నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సోమవారం 59వ వసంతంలోకి అడుగుపెట్టాడు.ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చిన్నారుల మధ్య ఎంతో ఉల్లాసభరితంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 10, 2019, 5:07 PM IST
బర్త్ డే విషెస్ చెప్పిన వారికి బాలయ్య ఏం చేసాడో తెలుసా..
నందమూరి బాలకృష్ణ
  • Share this:
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సోమవారం 59వ వసంతంలోకి అడుగుపెట్టాడు.ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చిన్నారుల మధ్య ఎంతో ఉల్లాసభరితంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి దిమ్మ దిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..ఈ రోజు తన బర్త్ డే సందర్భంగా పలువురు అభిమానులు, శ్రేయేభిలాషులు నాకు ఫోన్లు చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ నేనొకటే చెప్పాను. అందరికీ పుట్టినరోజున వయసు పెరిగితే.. నాకు మాత్రం తగ్గుతుంది అన్నాను. ఆ రకంగా నాకు బర్త్ డే విషెస్ చెప్పమన్నట్టు వాళ్లందరికీ నవ్వుతూ చెప్పానన్నారు.బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ


అంతేకాదు ఎవరైతే తాము పుట్టిన కుటుంబానికి, ఊరుకు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారో.. వారు మన మధ్య లేకపోయినా.. అందరి మనసుల్లో ఉండిపోతారన్నారు. అంతేకాదు నేను నటుడిగా, రాజకీయ నాయకుడిగా మా నాన్న ఎన్టీఆర్‌ను చూసి ఎంతో స్పూర్తి పొందానన్నారు. ఒక రకంగా క్యాన్సర్ హాస్పటల‌్‌తో ఎంతో మందికి సేవ చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. మరోవైపు క్యాన్సర్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా కారణమన్నారు. తనకు నిజమైన పుట్టినరోజు..క్యాన్సర్ హాస్పటల్ స్థాపించిన రోజు అంటూ చెప్పుకొచ్చారు.

First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>