తనపై వస్తున్న వార్తల్లో క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు.. అంతా ఫసక్ అంటున్న కలెక్షన్ కింగ్..

ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నటుడు కమ్ నిర్మాతైన మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎఫ్.డి.సీ) చైర్మన్‌గా నియమించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.

news18-telugu
Updated: July 5, 2019, 10:30 AM IST
తనపై వస్తున్న వార్తల్లో క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు.. అంతా ఫసక్ అంటున్న కలెక్షన్ కింగ్..
మోహన్ బాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 5, 2019, 10:30 AM IST
ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ పార్టీ తరుపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో ఏర్పడిన రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆయన క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వై.యస్.జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైయస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో మోహన్ బాబు ఎక్కడా పోటీ చేయకపోయినా.. తనదైన శైలిలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఈ ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ అఖండ మెజారిటీ సాధించింది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఖాళీగా పలు కార్పోరేషన్స్‌కు చైర్మన్‌లను నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నటుడు కమ్ నిర్మాతైన మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎఫ్.డి.సీ) చైర్మన్‌గా నియమించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. మీరనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తనను నియమించినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పందించారు. అలాంటి రూమర్స్ ఎవరు నమ్మవద్దని కోరారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా తామే ఈ విషయాన్నితెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...