‘అదుగో’ తర్వాత ‘ఆవిరి’ సినిమాతో సెగలు పుట్టిస్తోన్న రవిబాబు..

టాలీవుడ్‌లో ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే దర్శకుడు, నటుడు రవిబాబు కంటూ ప్రత్యేక శైలి ఉంది. ఆయన సినిమాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి.తాజాగా రవిబాబు ‘ఆవిరి’ అనే వైరెటీ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు.

news18-telugu
Updated: September 11, 2019, 12:58 PM IST
‘అదుగో’ తర్వాత ‘ఆవిరి’ సినిమాతో సెగలు పుట్టిస్తోన్న రవిబాబు..
రవిబాబు ‘ఆవిరి’ మూవీ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్‌లో ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే దర్శకుడు, నటుడు రవిబాబు కంటూ ప్రత్యేక శైలి ఉంది. ఆయన సినిమాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఫస్ట్ మూవీ ‘అల్లరి’ నుంచి ‘అనసూయ’, ‘నచ్చావులే’, ‘అమరావతి’, ‘అవును’, ‘అవును 2’ వంటి దేనికవే విభిన్న కథాచిత్రాలనే రూపొందించారాయన. రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా రవిబాబు ‘ఆవిరి’ అనే వైరెటీ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రవిబాబు తెరకెక్కించినట్టు కనబడుతోంది.

రవిబాబు ‘ఆవిరి’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)


‘ఆవిరి’ సినిమాలో రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇతర పాత్రల్లో నేహా చౌహాన్,శ్రీముక్త, భరణి శంకర్,ముఖ్తార్ ఖాన్ నటించారు. ఈ సినిమాను ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు  ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రకటించారు. మరి ‘ఆవిరి’ సినిమాతో రవిబాబు మరోసారి టాలీవుడ్‌లో తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

  
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు