తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కెఫ్టెన్ చలపతి చౌదరి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయచూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలుగు, తమిళ్,కన్నడ భాషాల్లో ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన పలు సీరియల్స్‌లో కూడా నటించారు. ఇటీవలే విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమలో కూడా నటించారు. చలపతి చౌదరితో స్వస్థలం విజయవాడ అయినప్పటికీ ఆయన రాయచూర్‌లో స్థిరపడ్డారు.
చిన్నప్పటి నుంచి నాటకాల్లో చలపతి నటించారు. ఎన్టీఆర్ నటన చూసి ఆయన సినిమాల్లోకి వచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌లో ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ నాటకలను చూశారు. ఆయన నాటకం వేయకపోతే.. ఆయనకు బదులు చలపతి నాటకాలు చేశారు. ఏఎన్ఆర్ చివరి సినిమా మనం సినిమాలో కూడా చలపతి చౌదరి నటించారు.తెలుగు భాష అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఎక్కువగా తెలుగు భాషలోనే స్పష్టంగా మాట్లాడేవారు చలపలి చౌదరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda movie, Bala Krishna, Tollywood