Anupam Shyam Dies: చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత..

ప్రముఖ నటుడు కన్నుమూత (File/Photo)

Anupam Shyam Dies: చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ అనారోగ్యంతో కన్నుమూసారు.

  • Share this:
    Anupam Shyam Dies: చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ముఖ్యంగా హిందీలో ప్రసారమయ్యే ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’లో ఈయన నటనను ఎవరు మరవలేరు. ఈయన వయసు 63. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఈయన గత కొద్ది రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈయన శరీరంలోని అవయవాలు వైఫల్యం చెందడంతో ీయన కన్నుమూసారని ఆయన స్నేహితుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు యశ్‌పాల్ శర్మ తెలియజేసారు. అనుపమ్ శ్యామ్ ‘మన్ కీ ఆవాజ్’ సీరియల్‌‌’లో సజ్జన్ సింగ్ పాత్ర ఈయకు మంచి పేరు తీసుకొచ్చింది.  కేవలం హిందీ సీరియల్స్ మాత్రమే కాదు.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో పాటు ‘బందిట్ క్వీన్’ వంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో గోరేగావ్‌లోని లైఫ్‌లైన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు చికిత్స చేసిన అవయవాలు స్పందించకపోవడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈయన మృతిపై బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన సీరియల్స్, సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ఈయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సుధీర్ఘ కెరీర్‌లో అనుపమ్ శ్యామ్.. ‘సత్య’, 2దిల్ సే’, ‘లగాన్’  వంటి చిత్రాలు కూడా ఈయనకు పేరు తీసుకొచ్చాయి.

    ‘మన్ కీ ఆవాజ్’ సీరియల్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. 2009లో ప్రారంభమైన ఈ సీరియల్ .. సెకండ్ సీజన్ రీసెంట్‌గా మొదలైంది. పోయినేడాది కూడా ఈయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అపుడు చికిత్స అందిస్తే.. ఆరోగ్యం మెరుగైంది. కానీ తాజాగా మరోసారి కిడ్నీ సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌లో చేరి మల్టీపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో కన్నుమూసారు.

    ఇవి కూడా చదవండి..

    HBD Mahesh Babu : ‘రాజ కుమారుడు’ నుంచి ‘సర్కారు వారి పాట’ వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప్రస్థానం..

    HBD Mahesh Babu -Sarkaru Vaari Paata : ’సర్కారు వారి పాట’లో మరోసారి దుమ్ము లేపిన మహేష్ బాబు.. అదిరిన సూపర్ స్టార్ స్టైలిష్ లుక్స్..

    Balakrishna - Mahesh Babu: మహేష్ బాబు కాపీ కొట్టిన బాలకృష్ణ ఈ సినిమాలు గురించి తెలుసా..

    Karate Kalyani : ఇకపై అలా చేస్తే వాళ్ల తాట తీస్తానంటున్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి..
    Published by:Kiran Kumar Thanjavur
    First published: