రియాలిటీ షో సెట్‌లోనే కుప్పకూలిన నటుడు.. గుండెపోటుతో మృతి..

గాడ్‌ఫ్రే గావ్ (File Photo)

చైనీస్ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే 'చేజ్ మీ' అనే ఓ రియాలిటీ షోకి హాజరైన గాడ్‌ఫ్రే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.

 • Share this:
  హాలీవుడ్ నటుడు,తైవానీస్ కెనడియన్ మోడల్ గాడ్‌ఫ్రే(35) గుండెపోటుతో మృతి చెందాడు. చైనీస్ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే 'చేజ్ మీ' అనే ఓ రియాలిటీ షోకి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు 3 గంటల పాటు ఆయన్ను బతికించేందుకు శ్రమించారు. అయితే ఆ ప్రయత్నాలేవీ
  సఫలం కాకపోవడంతో అతను మృతి చెందాడు. గాడ్‌ఫ్రే చనిపోవడం తమను షాక్‌కి గురిచేసిందని.. ఆయన ఇకలేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని సదరు రియాలిటీ షో యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

  కాగా,తైవాన్‌లో పుట్టిన గాడ్‌ఫ్రే కెనడాలో పెరిగాడు. లూయిస్ విట్టన్‌కి మోడల్‌కి వ్యవహరించిన మొట్టమొదటి ఏసియన్‌గా అతను పేరు సంపాదించుకున్నాడు. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ తనదైన నటనతో మెప్పించాడు.అలాగే పలు చైనీస్ టీవీ షోలతోనూ గాడ్‌ఫ్రే పాపులర్ అయ్యాడు. గాడ్‌ఫ్రే మృతి పట్ల ఆయన అభిమానులు,చైనీస్ నటీనటులు
  సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Srinivas Mittapalli
  First published: