Home /News /movies /

ACTOR ALLARI NARESH NAUTY COMMENTS ON ACTRESS ROJA EXTRA JABARDAST LATEST PROMO MNJ

Allari Naresh- Roja: రోజాతో హీరోగా చేయ‌లేదు.. జ‌బ‌ర్ద‌స్త్‌కి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. అల్ల‌రోడి చిలిపి కామెంట్లు

అల్లరి నరేష్ రోజా

అల్లరి నరేష్ రోజా

Roja- Allari Naresh: ఒక‌ప్పుడు టాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్ల‌లో రోజా ఒక‌రు. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన రోజా.. ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. రాను రాను సినిమాల‌ను త‌గ్గించుకుంటూ వ‌చ్చారు.

ఇంకా చదవండి ...
    Roja- Allari Naresh: ఒక‌ప్పుడు టాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్ల‌లో రోజా ఒక‌రు. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన రోజా.. ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. రాను రాను సినిమాల‌ను త‌గ్గించుకుంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఓ వైపు ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ.. మ‌రోవైపు బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్, బ‌తుకు జ‌ట్కా బండి వంటి ప‌లు షోల‌ల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే రోజా అంటే ఇప్ప‌టికీ చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్‌కి రోజా అంటే చాలా ఇష్టం. ఆ విష‌యాన్ని ఆయ‌న ప‌లుమార్లు వెల్ల‌డించారు. అంతేకాదు ఆమెపై ప‌లు సంద‌ర్భాల్లో ప్రేమ‌ను కూడా చూపించారు. ఇక ఈ లిస్ట్‌లో అల్ల‌రి న‌రేష్ కూడా చేరిపోయారు. రోజా ప‌క్క‌న హీరోగా చేయాల‌ని ఆయ‌న అన్నారు.

    అల్ల‌రి న‌రేష్ నాంది అనే చిత్రంలో నటించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి షో నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో అని.. ఈ మూవీకి అల్ల‌రోడికి మంచి క‌మ్ బ్యాక్ దొరికింద‌ని విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శ‌సంలు కురిపిస్తున్నారు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు సైతం నాందిపై, అల్ల‌రి న‌రేష్‌పై అభినంద‌న‌లు చెబుతున్నారు.


    ఇక ఈ మూవీ ప్రమోష‌న్ల‌లో భాగంగా అల్ల‌రి న‌రేష్, నాంది డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల జ‌బ‌ర్ద‌స్త్ షోలో పాల్గొన్నారు. వ‌చ్చే శుక్ర‌వారం ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుండ‌గా.. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. అందులో రోజాతో డ్యాన్స్ చేసిన అల్ల‌రి న‌రేష్.. ఆమెను ఎత్తుకొని తిప్పాడు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రోజా గారితో ఓ సినిమాలో న‌టించా. కానీ ఆమె ప‌క్క‌న హీరోగా చేయ‌లేదు. అందుకే జ‌బ‌ర్ద‌స్త్‌కి వ‌చ్చిన ప్ర‌తిసారి ఏదో ఫీలింగ్ అంటూ చిలిపి కామెంట్లు చేశాడు. మ‌రోవైపు రోజా మాట్లాడుతూ.. సీతార‌త్నం గారి అబ్బాయి సినిమా స‌మ‌యంలో అల్ల‌రి న‌రేష్ స్కూల్‌కి వెళ్లేవాడు. అప్పుడు నేను ఎత్తుకొని ఆడేదాన్ని. ఇప్పుడు న‌న్ను ఎత్తుకొని ఆడుతున్నాడు అని కామెంట్లు చేశారు.
    Published by:Manjula S
    First published:

    Tags: Allari naresh, Rk roja, Roja

    తదుపరి వార్తలు