Home /News /movies /

ACTOR ALI SHOCKING COMMENTS ON F3 MOVIE SUCCESS MEET SB

ఓ సినిమా పోతే చంకలు గుద్దుకోవడం ఏంటి.. ఇదంతా వాళ్లే చేస్తున్నారు..ఆలీ షాకింగ్ కామెంట్స్!

ఆలీ

ఆలీ

ఓ సినిమా సక్సెస్ అయితే.. నిర్మాత, దర్శకుడితో పాటు.. సినిమా టీం అంతా సక్సెస్ అవుతుందని.. అంతా బావుంటారని అన్నారు ఆలీ. బావున్న సినిమాల్ని కూడా బాలేదని ప్రచారం చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైందన్నారు.

    తాజాగా F3 సక్సెస్ మీట్‌(F3 Success meet) జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, హీరో,కమెడియన్ ఆలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాకు సినిమా తప్ప ఏది చేత కాదన్నారు ఆలీ(Ali). తమకు మరే ఏ వ్యాపారాలు లేవన్నారు. ఓ సినిమా హిట్ అయితే...ఓ నిర్మాత బావుంటాడు.. ఓ నిర్మాత బావుంటే ఓ దర్శకుడు బావుంటాడు. .. ఆర్టిస్టులు అంతా బావుంటారు... టెక్నీషీయన్లు అంతా బావుంటారు అన్నారు అలీ.. కాకపోతే.. కొంతమంది హిట్ అయిన సినిమా బాగోలేదని... కొంతమంది పనులు చేస్తున్నారని.. వాళ్లుకూడా ఉండేది ఈ ఇండస్ట్రీలోనే.. ఇది తప్ప వాళ్లకు కూడా ఏదీ చేతకాదన్నారు. ఓ సినిమా బావుందంటే.. ఆ డైరెక్టర్ హ్యీపీ అవతాడు.. ఆ యూనిట్ కూడా హ్యాపీ అవుతుందన్నారు. చాలామంది ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారన్నారు. వేలాది మంది ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారన్నారు.

    దయచేసి అలాంటి రిమార్కులు వద్దన్నారు.చెన్నైలో ఉండేటప్పుడు మేం ఇలాంటి వార్తలు ఎప్పుడూ వినలేదన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇలాంటివి ఎక్కువ అయ్యాయన్నారు. ఓ సినిమా పోతే మరో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు ఆలీ(Ali). దయచేసిన అలాంటివి మానేయండి అంటూ సూచించారు. మానేస్తేనే మంచిది.. మీరు నమ్మకున్న సినిమా.. అవతాలివారు బాగుండాలి అనుకుంటే భగవంతుడు మిమ్మల్ని వాడికంటే బాగా ఉంచుతాడన్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.

    ఎఫ్3లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) తనకు మంచి పాత్ర ఇచ్చారన్నారు. తన చేతికి ఓ గన్ ఇచ్చి ఫుల్ కామెడీ చేయించారన్నారు. ఎక్కడకు వెళ్లినా ఆ గన్ గురించే అంతా అడుగుతున్నారన్నారు.ఎఫ్4 (F4 Movie) లో కూడా ఇంతకుమించిన కామెడీ ఉంటుందన్నారు.  ఇటీవలే విడుదలైన ఎఫ్ 3 సినిమా మూడు రోజుల్లోనే 63 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మరో వారం రోజులు ఆగితే కానీ ఈ సినిమా ఫలితం ఏమిటనేది తెలియదు. ప్రస్తుతానికి కలెక్షన్స్ బాగానే రావడంతో అనిల్ రావిపూడి అండ్ ఎఫ్3 టీం సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ali, Anil Ravipudi, F3 Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు