జగన్‌కు నటుడు అక్షయ్ కుమార్ సాయం..

అక్షయ్‌కుమార్‌ వరుస హిట్ సినిమాలతో అదరగొడుతున్న హిందీ నటుడు. ఆయన తాజా చిత్రం గుడ్ న్యూజ్ కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ రాబట్టింది.

news18-telugu
Updated: January 31, 2020, 3:22 PM IST
జగన్‌కు నటుడు అక్షయ్ కుమార్ సాయం..
అక్షయ్ కుమార్ Photo : Twitter
  • Share this:
అక్షయ్‌కుమార్‌ వరుస హిట్ సినిమాలతో అదరగొడుతున్న హిందీ నటుడు. ఆయన తాజా చిత్రం గుడ్ న్యూజ్ కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాలో అక్షయ్‌కు జంటగా కరీనా కపూర్ నటించింది. అది అలా ఉంటే ఆయన గతంలో మిషన్ మంగళ్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ ప్రధాన పాత్ర పోషించగా.. విద్యా బాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్ ముఖ్య పాత్రల్లో అలరించారు. ఇస్రో చేపట్టిన మిషన్ మంగళ్‌యాన్ ప్రయోగం ఆధారంగా మిషన్‌ మంగళ్‌ తెరకెక్కించారు. 2019లో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్టు కొట్టింది. ఈ సినిమాతో జగన్ శక్తి బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా దర్శకుడు జగన్ తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లి అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే ముంబైలోని ఓ దవాఖానలో చెకప్ చేయించుకున్నాడు. అందులో భాగంగా అతడిని పరీక్షించిన వైద్యులు మెదడులోని రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. అంతేకాదు వెంటనే దీనికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు వెల్లడించారు.

దర్శకుడు జగన్ శక్తితో నటుడు అక్షయ్ Photo : Twitter


ఈ విషయం తెలుసుకున్న నటుడు అక్షయ్ కుమార్.. తనకు అదిరిపోయే హిట్ ఇచ్చిన దర్శకుడు జగన్‌ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరించడానికి ముందుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. అక్షయ్ కుమార్ కేవలం డబ్బు సాయమే కాకుండా జగన్ కుటుంబసభ్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆ కుటుంబసభ్యుల బాగోగులు చూసుకోవాలని తన సిబ్బందికి సూచించాడట. అలా ఆ కుంటుంబంతో పాటు అభిమానుల మనసును దోచుకున్నాడు అక్షయ్. ప్రస్తుతం లక్ష్మీ బాంబ్, బచ్చన్ పాండే సినిమాలను చేస్తున్నాడు. అంతేకాదు అక్షయ్ కుమార్ తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అత్రంగిరే అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా నటిస్తున్నాడు. సారా ఆలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్‌ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది.

First published: January 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు