యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి కన్నుమూశారు. ప్రముఖ స్టార్ హీరో అర్జున్ మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు తుది శ్వాస విడిచారు. ఆమె వయసు85 సంవత్సరాలు. మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉంచారు. అయితే అర్జున్ గురించిన విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు.
అర్జున్ బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో హీరోగా నటించాడు అర్జున్.పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు అర్జున్. ప్రస్తుతం అర్జున్ కూతురు ఐశ్వర్య తెలుగులో హీరో విశ్వక్ సేన్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. అర్జున్ అన్ని ప్రాంతీయ బాషలలో హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.
మన టాలీవుడ్ లో కూడా ఎంతో మంది డైరెక్టర్స్ మరియు నటీనటులతో అర్జున్ కి మంచి సాన్నిహిత్య సంబంధం ఉన్నది. మరోవైపు అర్జున్ , టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రాణ స్నేహితులు. విరిద్దరు కలిసి హనుమాన్ జంక్షన్ అనే సినిమా తీశారు. అయితే అర్జున్ గారి తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న జగపతి బాబు ఎక్కడో విదేశాల్లో జరుగుతున్నా షూటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని అర్జున్ ఇంటికి బయలుదేరాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Action King Arjun, Tollywood