Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ 15 ఏళ్ల కల నెరవేరింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈయన ఆంజనేయ స్వామి పరమ భక్తుడు. అంతేకాదు వీలైనపుడల్ల ఆంజనేయ స్వామి మాల వేసుకుంటూ ఆయనపై భక్తి చాటుకుంటారు. అంతేకాదు ఆయనపై భక్తితో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శ్రీఆంజనేయం’ సినిమాలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి వేషం వేసి ఆయనపై భక్తి ప్రకటించుకున్నారు. ఈయన శ్రీఆంజనేయం సినిమాలో హనుమంతుని వేషం వేసేటపుడే 15 యేళ్ల క్రితం ఆంజనేయ స్వామికి ఓ గుడి కట్టాలనుకుని దానికి శంకుస్థాపన చేసారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు సమీపసంలో తన సొంత స్థలంలో ఆయన ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఇపుడు ఆ కోవెల పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం భక్తుల దర్శనార్ధం ఆలయం పూర్తిగా సిద్ధమైంది. ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి జూలై 1 , 2 తేదిల్లో కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
View this post on Instagram
ఈ కార్యక్రమానికి తన స్నేహితులు, బంధు మిత్రులతో పాటు అభిమానులను ఆహ్వానించాలని ఉన్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు మిస్ కాకద్దనే ఉద్దేశ్యంతో ఆ కార్యక్రమానికి సంబంధించిన లింకులను తన ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చని తెలిపారు. మొత్తంగా అర్జున్.. ఆంజనేయ స్వామిపై తనకున్న భక్తిని ఇలా చాటుకున్నారు.ప్రస్తుతం అర్జున్ తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూనే.. తెలుగులో ‘ఖిలాడి’ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Action King Arjun, Kollywood, Tollywood