Home /News /movies /

ACTION HERO VISHAL LATEST OUTING SAMANYUDU GETTING HUGE RESPONSE IN OTT PLATFORM ZEE5 PK

Vishal Samanyudu in ZEE5: ఓటిటిలో విశాల్ యాక్షన్ థ్రిల్లర్ ‘సామాన్యుడు’ సినిమాకు అనూహ్య స్పందన..

సామాన్యుడు సినిమాకు జీ5లో అనూహ్య స్పందన (vishal samanyudu)

సామాన్యుడు సినిమాకు జీ5లో అనూహ్య స్పందన (vishal samanyudu)

Vishal Samanyudu in ZEE5: ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న 'సామాన్యుడు' (Vishal Samanyudu) సినిమాకు వీక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తుంది. విశాల్ యాక్షన్ థ్రిల్లర్ ‘సామాన్యుడు’కు తమిళంలో కంటే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

కొన్ని సినిమాలకు అప్పుడున్న పరిస్థితులు కావచ్చు.. లేదంటే మరే ఇతర కారణమైనా కావచ్చు కానీ థియేటర్స్‌లో అనుకున్నంత పర్ఫార్మ్ చేయవు. కానీ అవే సినిమాలు ఓటిటిలో విడుదలైనపుడు మాత్రం కచ్చితంగా అనూహ్య ఫలితాలు అందుకుంటాయి. ఇప్పుడు విశాల్ సామాన్యుడు (Vishal Samanyudu) సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న 'సామాన్యుడు' సినిమాకు వీక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తుంది. విశాల్ యాక్షన్ థ్రిల్లర్ ‘సామాన్యుడు’కు తమిళంలో కంటే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకుపోతోంది.

ZEE5 ప్రతి నెలా సినిమాలు మరియు ఒరిజినల్‌లను విడుదల చేస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది. తమిళంలో 'వీరమే వాగై సూదుం' పేరుతో విశాల్ నటించిన 'సామాన్యుడు' మార్చి 4 నుండి ZEE5లో ప్రసారం అవుతుంది. తెలుగు మరియు తమిళ వెర్షన్‌లతో పాటు, కన్నడ వెర్షన్ కూడా ప్రసారం అవుతోంది.

Thaman remuneration: రేంజ్ మారింది.. రేటు పెరిగింది.. ‘అఖండ’ తర్వాత థమన్ రెమ్యునరేషన్‌కు రెక్కలు..


తెలుగులో విడుదలైన సామాన్యుడుకు ZEE5 వీక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.ఇటీవలే విడుదలైన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'లూజర్', 'లూజర్ 2', సుమంత్ నటించిన 'మళ్లీ మొదలైంది', అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల 'బంగార్రాజు' విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. మార్చి 11 నుండి 'రౌడీ బాయ్స్' స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో మోస్ట్ పాపులర్ అయిన విశాల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.డింపుల్ హయతి, రవీనా రవి, యోగి బాబు మరియు రమణ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అద్భుతమైన కంటెంట్ ఉండడంలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.. , ఇది థియేటర్లలో విడుదలైనప్పుడు  ప్రేక్షకుల నుండి మంచి  రెస్పాన్స్ వచ్చింది,థియేటర్స్ లలో చూడని వారుంటే తమ ఇళ్లలో లేదా ప్రయాణంలో సౌకర్యంగా ఉన్నపుడు ZEE5 ను సబ్ స్క్రైబ్ చేసుకొని వీక్చించవచ్చు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero vishal, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు