Karthika Deepam:ప్రస్తుతం బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కథ మొత్తం ఆసక్తిగా కనిపిస్తుంది. అసలు మోనిత ఎక్కడికి వెళ్లిందని ప్రేక్షకులకు అనుమానంగా ఉంది. ఇక పోలీస్ స్టేషన్ లో సౌందర్య నేనే మర్డర్ చేశాను అంటూ లొంగిపోవటానికి వచ్చిన సంగతి తెలిసిందే. రోషిణి మాత్రం సౌందర్య మర్డర్ చేయలేదని కనిపెట్టి బయటపెడుతుంది. వెంటనే సౌందర్యం మీరు చాలా తెలివైన వారు.. మరి కార్తీక్ కూడా హత్య చేయలేదని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తుంది.
అలా వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా నా కొడుకు వల్ల మోనిత గర్భవతి కాలేదు.. ఆర్టిఫిషియల్ గర్భం దాల్చిందని రోషిణికి చెబుతుంది. కావాలంటే సమాచారం కోసం ఓ అడ్రస్ ఇచ్చి కార్తీక్ ను చూస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక పిల్లలను, దీపను తన ఇంటికి తీసుకు వెళుతుంది. ఇక భాగ్యం తెగ బాధ పడుతుంది. మురళి కృష్ణ అన్నం తీసుకు వచ్చి తినమని బ్రతిమాలుతాడు. మరోవైపు కార్తీక్ ముందు మరో కొత్త మనిషి కానిస్టేబుల్ గెటప్ లో ఎంట్రీ ఇస్తుంది. డాక్టర్ సార్.. చాయ్ తాగండి అంటూ పలకరిస్తుంది.
కార్తీక్ తో కొన్ని మాటలు మాట్లాడి బాగోగులు అడుగుతుంది. ఇక కార్తీక్ ఆమె పేరును అడగగా రత్న సీత అని చెబుతుంది. ఈ కొత్త క్యారెక్టర్ ని చూస్తే మోనితకు సంబంధించిన మనిషేమో అని అనుమానంగా ఉంది. మరోవైపు సౌందర్య మాటలు గుర్తు చేసుకుంటుంది రోషిణి. అయినా కూడా కార్తీక్ నిజ స్వరూపాన్ని మాత్రం నమ్మలేకపోతుంది. ఎలాగైనా కార్తీక్ కు శిక్షపడేలా చేయాలనుకుంటుంది.
మరోవైపు భాగ్యం ఏడుస్తూ సౌందర్య ఇంటికి వెళ్తుంది. నేనేం చేయలేదు వదిన.. అనేసరికి సౌందర్య నువ్వేం చేసావ్ భాగ్యం అని అంటుంది. ఇక దీప దగ్గరికి వెళ్లి సౌందర్య ఏం జరిగింది అని ప్రశ్నించడంతో.. వెంటనే కార్తీక్ కు చూపించిన మోనిత వీడియోను చూపిస్తుంది. ఆ వీడియో చూసే సరికి సౌందర్య షాక్ అవుతూ.. చంపేసే ఉంటాడు.. ఆ మోనిత ని కార్తీక్ చంపేసే ఉంటాడు అని అనడంతో దీప షాక్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Doctor babu, Karthik, Karthika deepam, Monitha, Nalla deepa, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka