Karthika Deepam: వంటలక్క మాటలను తప్పు పట్టిన ఏసీపీ.. ఎంత పొగరుగా సమాధానం చెప్తుంది అంటూ?

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. సామాన్యులను, సెలబ్రెటీలను కూడా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారడంతో ఈ సీరియల్ ను అస్సలు వదులుకోవడమే లేదు.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరపై అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. సామాన్యులను, సెలబ్రెటీలను కూడా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారడంతో ఈ సీరియల్ ను అస్సలు వదులుకోవడమే లేదు.  ఇక దీప ఏసీపీ రోషిణి దగ్గరికి వెళ్లి మోనిత గురించి చెబుతుంది. అంతేకాకుండా అంజి గురించి కూడా చెబుతుంది. అంజి ఒక డ్రైవర్ అని, హిమ ప్రాణాలు తీయడానికి అతనికి మోనిత డబ్బులు ఇచ్చిన విషయాన్ని గురించి గతంలో జరిగిన విషయాలన్నీ రోషిణికి చెబుతుంది. అంజిని పట్టుకుంటే నిజాలు బయట పడతాయి అని అంటుంది. ఇక రోషిణి కడుపు నుంచి క్రైమ్ వరకు వెళ్ళిందని అనుకుంటుంది. దీప అక్కడ నుంచి బయలుదేరుతూ.. మోనిత మీకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను మీకు వివరణ ఇస్తున్నాను లేదంటే ఎవరి అవసరం లేకుండానే తన కుట్ర ఏంటో తెలుసుకుని దాన్ని అంటుంది.

    భాగ్యం దీప ఇంటికి చేసిన వంటలు తీసుకొని వస్తుంది. అమ్మేదే అని పిల్లల్ని అడగడంతో డాడీకి ఇష్టం లేకపోయినా రోషిణి పెద్దామె కదా అని ఆమె ఇంటికి వంట చేయడానికి.. దీప చెప్పిన్నట్లు చెబుతారు. ఇక భాగ్యం అర్థం చేసుకుంటుంది. ఆ సమయంలో దీప రావడంతో అక్కడ జరిగిన విషయాలను పిల్లలకు అర్థం కాకుండా అడుగుతుంది. ఇక దీప పిన్ని లో ఎంత మార్పు అని సంతోషిస్తుంది. మరోవైపు మోనిత దీప ఇచ్చిన వార్నింగ్ గురించి తలుచుకొని టెన్షన్ పడుతుంది. అంజి, దుర్గా పేర్లు తలుచుకొని భయపడుతుంది. తాను ఎక్కుబెట్టిన బాణాలు తనకే తగిలేలా ఉన్నాయి ఏంటని అనుకుంటుంది. ఇక ఆ సమయంలో ప్రియమణి రావడంతో ప్రియమణి అడిగిన ప్రశ్నలకు మండిపోతూ జవాబు చెబుతుంది. దీపని ఎత్తుకు పైఎత్తు వేసి తీరుతాను. చిత్తు చిత్తుగా ఓడిస్తాను అంటూ రగిలిపోతుంది.

    Karthika deepam
    Karthika deepam


    ఇక దీప చివర్లో అన్న మాటలు గుర్తు చేసుకొని ఫైర్ అవుతూ తనలో తాను కూల్ అవుతుంది రోషిణి. దీప ఆత్మాభిమానం గురించి తలుచుకుంటుంది. ఎవరికో ఫోన్ చేసి అంజి గురించి చెబుతుంది. ఇది చాలెంజింగ్ కేసని.. ఇద్దరు డాక్టర్లే కదా.. ఇద్దరికీ డీఎన్ఏలో తేలిపోతుంది అన్న విషయం తెలుస్తుంది కదా అంటూ తనలో తాను ఆలోచించుకుంటూ అంజి పట్ల యూస్ ఏముందో చూడాలి అనుకుంటుంది. ఇక నిజం తెలిసిన ఆనందరావు మోనితని పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్తావు, దీపను ఎక్కడికి తీసుకెళ్తావ్ అని తన మాటలతో ఆవేశ పడుతుంటాడు. ఇక దీప తిట్టొద్దు అన్నట్టుగా మావయ్య గారు అని అనేసరికి ఇంకో భార్యను తెచ్చుకుంతంటాడంటా అమ్మ అంటూ కోపంతో ఊగిపోతాడు. కార్తీక్ పై బాగా ఫైర్ అవుతుంటాడు ఆనందరావు.
    Published by:Navya Reddy
    First published: