Home /News /movies /

Karthika Deepam: మోనిత కడుపు ఒక నాటకం.. ఏసీపీ రోషిని ముందు మోనిత గుట్టు బయటపెట్టిన వంటలక్క!

Karthika Deepam: మోనిత కడుపు ఒక నాటకం.. ఏసీపీ రోషిని ముందు మోనిత గుట్టు బయటపెట్టిన వంటలక్క!

Karthika deepam

Karthika deepam

Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా అభిమానులుగా మార్చుకుందో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటు పడ్డారు

    Karthika Deepam: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా అభిమానులుగా మార్చుకుందో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం కథ మరింత రసవత్తరంగా మారడంతో సీరియల్ ను అసలు మిస్ చేసుకోవడం లేదు అభిమానులు. మోనిత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అదంతా నాటకమని అనుకుంటాడు కార్తీక్. ఇక దీప కూడా ఇదంతా మోనిత కావాలని చేస్తున్న నాటకమని అనుకుంటుంది. కార్తిక్ ఇంటికి రాగానే వెంటనే దీప మోనిత సూసైడ్ అటెంప్ట్ నాటకం రక్తి కట్టించిందా అంటూ ప్రశ్నిస్తుంది. దాంతో కార్తీక్ నీకు ఎలా తెలుసని ఆశ్చర్యపోతాడు. అలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చెప్పి బెదిరించరు అని నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది అని అంటుంది.

    కార్తీక్ కూడా అవును అంటూ.. వెళ్లేసరికి డాక్టర్ భారతి, ఏసీపీ రోషిణి కూడా ఉన్నారని చెబుతాడు. ఇక దీప కడుపు అనేది నాటకమని తెలిసినప్పుడే మన జీవితం బాగుపడుతుంది అంటూ నిజం చెబుతుంది. ఇక కార్తీక్ డాడీ కి ఈ విషయాలు తెలిస్తే తట్టుకోలేరని అంటాడు. ఇక కార్తీక్ తల పట్టుకొని ఏదో ఆలోచిస్తున్న సమయంలో ఆనందరావు అక్కడికి వచ్చి ఏమైంది అని అనుమానంగా ప్రశ్నిస్తాడు. ఇక దీప భాగ్యం తో కలిసి మోనిత పని పట్టడానికి ఆలోచిస్తారు. రంగంలోకి దిగాల్సి అంటూ భాగ్యం అనడంతో తన దగ్గర ఉన్న ఓ ప్లాన్ చెబుతుంది దీప. ఇక వెంటనే ప్లాన్ బాగుందని మురిసిపోతుంది భాగ్యం. ఆనందరావు తన ఫ్రెండ్ కుమారుడిని కలవడానికి తెలంగాణ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్తాడు.

    అక్కడ మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకుంటున్నారని తన ఫ్రెండ్ కుమారుడు, రిజిస్టర్ ఆఫీసర్ చెప్పడంతో షాక్ అవుతూ బయటకు వెళ్తాడు. ఇక మోనిత కంప్లైంట్ గురించి చర్చించేందుకు రోషిణి ఇంటికి బయలు దేరుతుంది దీప. ఇక కార్తీక్ గురించి, ఆయన నిజాయితీ గురించి చెబుతుంది. ఇక మోనిత అబద్ధమని లేదా నిజమని ఏ విషయం చెప్పటం లేదని.. నా భర్తను ఉచ్చులోకి లాగి ప్రయత్నం చేస్తుందని రోషిణి తో చెబుతుంది. ఇక డ్రైవర్ అంజి గురించి తెలుపుతూ హిమ ని చంపడానికి కుట్ర చేసిందని అతను తెలిపాడని.. అతడిని విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి అని అనడంతో.. ఈ విషయం విన్న రోషిణి షాక్ అవుతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Acp roshini, Karthika deepam, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు