హోమ్ /వార్తలు /సినిమా /

Acharya - Chiranjeevi: ఆచార్య సినిమా కోసం ఆ సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా.. చిరంజీవి మెగా ప్లాన్ ఇదేనా..

Acharya - Chiranjeevi: ఆచార్య సినిమా కోసం ఆ సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా.. చిరంజీవి మెగా ప్లాన్ ఇదేనా..

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉంటుంది..? పక్కా కమర్షియల్ అంశాలు.. డాన్సులు.. ఫైట్లు.. అలా ఆయన్ని రెండున్నర గంటలు స్క్రీన్‌పై చూసినా కూడా తనివి తీరదు. మరి అలాంటి చిరంజీవి కాసేపు అలా మెరిసి మాయం అయిపోతే.. ఆయన్ని అతిథిగా మార్చేస్తే..! అవును.. చిరంజీవి 43 ఏళ్ళ కెరీర్‌లో దాదాపు 11 సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. ఇలా కనిపించి అలా మాయమైపోయాడు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలే కాకుండా.. కేవలం గెస్ట్ రోల్స్ చేసిన ఈ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

Chiranjeevi - Acharya: ఆచార్య సినిమా కోసం మరోసారి తనకు కలిసొచ్చిన ఆ సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా.. ఇంతకీ చిరంజీవి మెగా ప్లాన్ ఇదేనా.. వివరాల్లోకి వెళితే.. 

  Chiranjeevi - Acharya: ఆచార్య సినిమా కోసం మరోసారి తనకు కలిసొచ్చిన ఆ సెంటిమెంట్‌ వర్కౌట్ అవుతుందా.. ఇంతకీ చిరంజీవి మెగా ప్లాన్ ఇదేనా.. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఈ  సినిమా తెరకెక్కుతూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రామ్ చరణ్.. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ .. 20 రోజుల డేట్స్ కేటాయించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. సిద్ధా అనే స్టూడెంంట్ యూనియన్ లీడర్‌ ఎందుకు నక్సలైట్‌గా మారాడనేది ఈ సినిమాలో కీలకం. ఇప్పటికే మారేడుమిల్లిలో రామ్ చరణ్, పూజా హెగ్డేలపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు సినిమాలో 45 నిమిషాలకు పైగా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  ఐతే.. మే లో సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఓ చిత్రం మే లో విడుదల అవుతోంది. 1993లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మెకానిక్ అల్లుడు సినిమా మే 27న విడుదలై పర్వాలేదనిపించింది.

  ‘మెకానిక్ అల్లుడు’ లో చిరంజీవి,విజయశాంతి (Facebook/Photo)

  అంతకు ముందు రెండేళ్ల ముందు 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా మే 9న రిలీజైంది.ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేసింది. దీనికంటే ముందు 1990లో మే 9న విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేయడం విశేషం.

  మేలో విడుదలైన చిరు బ్లాక్ బస్టర్ మూవీస్ జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ (file/photos)

  ఇక 1986లో చిరంజీవి నటించిన ‘వేట’ మూవీ మే 28న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. మొత్తంగా మే లో విడుదలైన చిరంజీవి చిత్రాల్లో రెండు బ్లాక్ బస్టర్స్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే.. ఒకటి యావరేజ్..ఒకటి మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా మెగాస్టార్‌కు రెండు ఇండస్ట్రీ హిట్స్ వచ్చిన మే నెలలో ఇపుడు ‘ఆచార్య’ సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమాపై మెగాభిమానుల్లో ప్రత్యేకమైన  ఆసక్తి నెలకొంది. అందుకే మే  సెంటిమెంట్ వర్కౌటై చిరంజీవి.. ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తాడా లేదా అనేది చూడాలి. 

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Pooja Hegde, Ram Charan

  ఉత్తమ కథలు