హోమ్ /వార్తలు /సినిమా /

Acharya Vs F3 : ఆచార్య వర్సెస్ F3.. బాక్సాఫీస్ పోటీలో ఆచార్య ఉన్న తగ్గేదేలే అంటున్న ఎఫ్ 3..

Acharya Vs F3 : ఆచార్య వర్సెస్ F3.. బాక్సాఫీస్ పోటీలో ఆచార్య ఉన్న తగ్గేదేలే అంటున్న ఎఫ్ 3..

ఆచార్య క్లాషెస్ విత్ ఎఫ్ 3 మూవీ (Instagram/Photo)

ఆచార్య క్లాషెస్ విత్ ఎఫ్ 3 మూవీ (Instagram/Photo)

Acharya Vs F3 : ఆచార్య వర్సెస్ F3.. బాక్సాఫీస్ పోటీలో ఆచార్య ఉన్న తగ్గేదేలే అంటున్న ఎఫ్ 3..ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా ఇపుడు టాలీవుడ్‌ సినిమాల విడుదల తేదిలపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది.

Acharya Vs F3 : ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా ఇపుడు టాలీవుడ్‌ సినిమాల విడుదల తేదిలపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. అదే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. ఇప్పటికే నాలుగు సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకొని.. మరో రెండు కొత్త తేదిలు ప్రకటించి..తాజాగా ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అప్పటికే ప్రకటించిన సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో ఏప్రిల్ 1కు రావాల్సిన చిరంజీవి, రామ్  చరణ్‌ల ‘ఆచార్య’ ఏప్రిల్ 29కు పోస్ట్ పోన్ అయింది. మరోవైపు అదే తేదిన ‘భీమ్లా నాయక్’ మూవీ కారణంగా ఈ సినిమా ఏప్రిల్ 29కు పోస్ట్ పోన్ అయింది.త తాజాగా ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ప్రకటనతో ఈ సినిమా విడుదల తేది వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అయితే... ఫిబ్రవరి 25 లేకుంటే ఏప్రిల్ 1న ‘భీమ్లా నాయక్’ అంటూ రెండు విడుదల తేదిలు ప్రకటించారు.

కానీ దిల్ రాజు మాత్రం ‘ఎఫ్ 3’ మూవీ పై కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే కాదు.. ’ఆచార్య’ మూవీకి భయపడేదే లేదు అంటూ అదే రోజున వస్తున్నట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. మొత్తంగా చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన ఈ సినిమా కావడం.. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అను నేను’ వంటి వరుస సక్సెస్‌లతో  అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో  ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Mahesh Babu - Sarkaru Vaari Paata : మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అఫీషియల్ ప్రకటన..

మరోవైపు అనిల్ రావిపూడి.. ఇప్పటి వరకు తెరకెక్కించిన ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ వరుస సక్సెస్‌లతో ఈయన కూడా ఒక్క ఫ్లాప్‌లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనిల్. ఇక ఎఫ్ 3 మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తైయింది.  మొత్తంగా కెరీర్‌లో ఒక్క ఫ్లాపు ఇవ్వని ఈ దర్శకులు ఇపుడు బాక్సాఫీస్ దగ్గర ‘ఢీ’ అంటే ఢీ అనే పరిస్థితి కల్పించింది ’ఆర్ఆర్ఆర్’ చెప్పాలి. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రాకతో అపుడు సంక్రాంతితో పాటు ఇపుడు కొత్త రిలీజ్ డేట్స్ విషయంలో కొట్టుకు చచ్చేంత పని చేస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్ 3’ మూవీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. గతంలో ‘ఎఫ్ 2’ సినిమా విడుదలైన సమయంలో బాలకృష్ణ .. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రజినీకాంత్ ‘పేట’.. రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల ‘వినయ్ విధేయ రామ’ సినిమాలు విడుదలయ్యాయి. ఇంత పెద్ద మాస్ హీరోల మధ్య విడుదలైన ‘ఎఫ్ 2’ సంక్రాంతి విజేతగా నిలిచింది.

RRR : ఆర్ఆర్ఆర్ రిలీజయ్యేది మార్చి 18, ఏప్రిల్ 28 కాదు.. కొత్త డేట్ ఇదే..

ఒకవేళ ‘ఎఫ్ 3’కు పాజిటిట్ టాక్ వచ్చిందనుకోండి.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపెడుతారు. అదే సమయంలో చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కానీ అంత ఈజీగా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇక పనిలో పనిగా జనవరి 13 నుంచి ఏప్రిల్ 1కు పోస్ట్ పోన్ అయిన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ఇపుడు మే 12న వస్తున్నట్టు ప్రకటించారు. ఇక మిగిలిన మరో బిగ్ మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా ఐతే.. గీతే.. మార్చి 4న ఆర్ఆర్ఆర్ మూవీకి మూడు వారాల ముందే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ అనే ఒక్క సినిమా కారణంగా మిగతా సినిమాల తమ విడుదల తేదిలను రీ షెడ్యూల్స్ చేసుకుంటున్నాయి. మరి ఇపుడు చెప్పినట్టు అవే డేట్స్‌లో ఈ సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అనేది కరోనా కేసుల పై ఆధారపడి ఉందనే చెప్పాలి.

First published:

Tags: Acharya, Anil Ravipudi, Chiranjeevi, F3 film, Koratala siva, Ram Charan, Tollywood, Varun Tej, Venkatesh

ఉత్తమ కథలు