• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACHARYA TEASER MEGASTAR CHIRANJEEVI KORATALA SIVA RAM CHARAN WILL ANNOUNCE RELEASE DATE ALSO TA

Chiranjeevi - Acharya: చిరంజీవి ‘ఆచార్య’ నుంచి టీజర్‌తో మరో క్రేజీ అప్‌డేట్..

Chiranjeevi - Acharya: చిరంజీవి ‘ఆచార్య’ నుంచి టీజర్‌తో మరో క్రేజీ అప్‌డేట్..

‘ఆచార్య’ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్ (Twitter/Photo)

Acharya Teaser - Chiranjeevi - Ram Charan - Koratala Siva | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌తో పాటు మరో అప్‌డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం.

  • Share this:
    Acharya Teaser - Chiranjeevi - Ram Charan - Koratala Siva | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ ఆంక్షల తర్వాత రీసెంట్‌గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే  యువ విద్యార్ధి నాయకుడు నక్సలైట్‌గా ఎందుకు మారాడనేది ఈ సినిమాలో కీలక మలుపు అని చెబుతున్నారు.  ఈ  పాత్రను కేవలం రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసాడు కొరటాల. ఇప్పటికే మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో కలిసి కనిపించారు చిరు, రామ్ చరణ్. కానీ అవన్నీ కొన్ని నిమిషాల పాటు వచ్చి మాయం అవుతుంటాయి. కానీ ఆచార్యలో అలా కాదు.. దాదాపు చిరంజీవి, రామ్  చరణ్ స్క్రీన్ పై  అరగంటకు పైనే ఉంటుందని సమాచారం. కానీ కొరటాల శివ మాత్రం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను గంట వరకు పొడిగించినట్టు సమాచారం.

    ఈ సినిమా టీజర్‌ను మరికాసేట్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌తో పాటు ఈ సినిమా విడుదల తేదిని కూడా అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం కూడా ఉందనేది సమాచారం. ఈ సినిమాను మే 9న జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ విడుదలైన తేదిలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

    ఈ సినిమాలో ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ పై కొన్ని కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయట. ఈ సన్నివేశాలను నెక్ట్స్ షెడ్యూల్లో రాజమండ్రికి సమీపంలోని మారేడుమిల్లి అనే అడవిలో ఫిబ్రవరి 7న నుంచి షూట్ చేయనున్నట్టు  సమాచారం. ఆచార్య సినిమాను కొరటాల శివ.. ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఇందులో దేవాదాయ ధర్మదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటించనున్నారు. దేవాలయాలు సాంస్కృతిక చిహ్నాలు.. అలాంటి దేవాలయాలు కొందరి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. దీనికి ఆచార్య ఎలాంటి ముగింపు పలకిడానేదే ఈ సినిమా స్టోరీ. మొత్తంగా ఈ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు