Home /News /movies /

ACHARYA MOVIE SAANA KASTAM SONG PROMO RELEASED AND CHIRANJEEVI THRILLED WITH HIS MOVES PK

Acharya movie song promo: చిరంజీవి ‘ఆచార్య’ సాంగ్ ప్రోమో విడుదల.. మెగాస్టార్ డాన్సులకు ఫిదా..

ఆచార్య ప్రోమో సాంగ్ (Acharya movie)

ఆచార్య ప్రోమో సాంగ్ (Acharya movie)

Acharya movie song promo: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Acharya movie song promo) హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం మెగాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా సైరా వచ్చి రెండేళ్ళు కావడంతో మెగాస్టార్ సినిమా కోసం చూస్తున్నారు.

ఇంకా చదవండి ...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం మెగాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా సైరా వచ్చి రెండేళ్ళు కావడంతో మెగాస్టార్ సినిమా కోసం చూస్తున్నారు. మధ్యలో మాయదారి కరోనా వచ్చింది కానీ లేకపోతే ఈ సినిమా మే 13న విడుదలయ్యేది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూనే ఉంది. చివరికి ఫిబ్రవరి 4న విడుదల తేదీ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్‌లోనూ ఇదే విషయం చూపించారు కూడా. ఆచార్య షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ధర్మస్థలి అంటూ భారీ సెట్ ఒకటి నిర్మించారు.

చిరంజీవి కూడా ఈ సెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఆర్ట్ డైరెక్టర్ సెల్వరాజన్ ఈ గుడి సెట్ కోసం చాలా రోజుల పాటు కష్టపడ్డారు. అలాగే నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేసారు. ఈ సినిమా బడ్జెట్‌లో అత్యధిక భాగం ఈ సెట్‌కే కేటాయించారు దర్శక నిర్మాతలు. 20 ఎకరాల విస్తీర్ణంలో 20 కోట్లకు పైగా ఖర్చుతో ఈ సెట్ నిర్మించారు. ఒక్క సెట్ కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా అనే అనుమానాలు కూడా రావచ్చు కానీ సినిమాలో చాలా భాగం షూటింగ్ ఇక్కడే చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ. ఒక్కముక్కలో చెప్పాలంటే 60 శాతం ఆచార్య షూటింగ్ ఇక్కడే ఉంటుంది. రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇందులోనే చేసారు.


సినిమాలో ఇది కూడా కీలక భాగమే. ధర్మస్థలి అనే ఊరు చుట్టూనే ఆచార్య సినిమా కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమో విడుదలైంది. శానా కష్టం వచ్చిందే మందాకిని అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ వింటేజ్ స్టెప్పులు కనిపించాయి. 66 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే డాన్సులతో మాయ చేసాడు చిరంజీవి. ఈ పాటలో రెజీనా స్టెప్పులేసింది. అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది రెజీనా. ఈ పాట చిత్రీకరణ జరిగి కూడా చాలా రోజులైపోయింది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సైరా 2019 అక్టోబర్ 2న విడుదలైంది. దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు వస్తున్నాడు మెగాస్టార్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Acharya movie, Chiranjeevi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు