రిలీజ్ తేదీ | : | 29/4/2022 |
దర్శకుడు | : | Koratala Siva - కొరటాల శివ |
సంగీతం | : | Manisharma - మణిశర్మ |
నటీనటులు | : | Chiranjeevi,Ram Charan, Pooja Hegde, SonuSood, Jishusen Gupata |
సినిమా శైలి | : | Action Naxal Back Drop - నక్సల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ |
రివ్యూ : ఆచార్య
నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సత్యదేవ్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సోనూసూద్, జిషుసేన్ గుప్తా, నాజర్ తదితరులు..
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : తిర్రు
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాత : రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కొరటాల శివ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). అపజయం అంటూ ఎరగని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాతో తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ..
ధర్మస్థలిలో బసవ (సోనూసూద్) గుప్పిట్లో గిలగిల లాడుతూ ఉంటోంది. ధర్మం ఉండాల్సిన ధర్మస్థలిలో అధర్మం రాజ్యం ఏలుతూ ఉంటోంది. ఈ క్రమంలో ఆచార్య (చిరంజీవి) అక్కడికి వస్తారు. ధర్మస్థలిలో బసవతో పాటు అతని మనుషులు అరాచకాలు సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆచార్య.. ధర్మస్థలిలో బసవను ఎలా ఎదిరించాడు. ఈ క్రమంలో సిద్ధ (రామ్ చరణ్)కు ధర్మస్థలి పక్కనే ఉన్న పాద ఘట్టం ఉంటుంది. అక్కడ సిద్ద ఆ ప్రాంత సందక్షకుడిగా ఉంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి సిద్ధ ఏమైపోతాడు. ? అసలు సిద్ధ ఎవరు ? అతనికి ఆచార్యకు ఉన్న సంబంధం ఏమిటన్నదే ఈ సినిమా కథ.
కథనం ..
అపజయం అంటూ ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా రామ్ చరణ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడంతో ఆకాశమే హద్దుగా సాగింది. ఎలా ఇద్దరు హీరోలు ఉన్నపుడు కథ లేకున్నా.. కథనం, ఎలివేషన్ సీన్స్ బాగుంటే.. సినిమా నిలబడుతోంది. కానీ ఇద్దరు హీరోలను పెట్టుకుని కూడా సరైన ఎలివేషన్ సీన్స్ పండించడంలో కొరటాల శివ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్‌ల మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రమే ఈ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. అసలు కథ విషయానికొస్తే.. అడవుల్లో ఉన్న మైనింగ్ సంపదను దోచుకోవడానికి కార్పోరేట్లు అడవులపై పడటం.. అక్కడున్న ఆదివాసీలను వెళ్లగొట్టి అక్కడ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేస్తారు. ఈ అడవి సంపదను దోచుకునే బడా బాబులకు అన్నలైన కామ్రేడ్లు రంగ ప్రవేశం చేసి వారి ఎత్తులను చిత్తు చేయడం చేయడం బాగానే ఉన్నా.. అది సరైన క్రమంలో చూపించడంలో కొరటాల శివ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా 80, 90ల నాటి కథ, కథనం ఈ సినిమాకు మైనస్. ఫ్లాష్‌బ్యాక్‌లో ధర్మస్థలి, పాదఘట్టంలో మరిన్ని ఎలివేషన్ సీన్స్ పెడితే.. బాగుండేది. కానీ కొరటాల శివ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. కెమెరామెన్ తిరు పనితనం బాగున్నా.. సినిమా మొత్తంగా మణిరత్నం సినిమా తరహాలో అంతా డార్క్‌గా చీకటిగా సాగడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పొచ్చు. ఇందులో ఫ్లాష్‌బ్యాక్‌లో చిరంజీవిని చూపించే గ్రాఫిక్స్ అత్యంత పేలవంగా ఉన్నాయి.
ఇక నటీనటలు విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి డాన్స్, యాక్టింగ్ విషయంలో తనదైన గ్రేస్ చూపించారు. ఫైట్స్ విషయంలో కాస్త తడబడినట్టు కనబడింది. ఇక రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ముఖ్యంగా అడవిలో నక్సలైట్స్లను చంపే క్రమంలో కార్పోరేట్లు పంపే ప్రైవేటు సైన్యాన్ని రామ్ చరణ్ ఎదుర్కొనే యాక్షన్ ఘట్టాలు బాగున్నాయి. ఇక చిరంజీవి, రామ్ చరణ్.. మైనింగ్ జరిగే ప్రదేశంలో విలన్స్‌ను కామెడీగా చంపే సన్నివేశాలు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఇక వీళ్లిద్దరు కలిసి చేసిన బంజారా సాంగ్ బాగుంది. లాహే లాహే పాటలో చిరంజీవి స్టెప్స్ అదుర్స్ అనాల్సిందే. ఇక పూజా హెగ్డే ఈ సినిమాలో ఉన్నా.. లేకున్నా.. కథలో పెద్దగా మార్పులేవి ఉండేవి కావు. ఏదో రామ్ చరణ్‌కు కథానాయిక పెట్టాలనే ఉద్దేశ్యంతో ఏదో పెట్టినట్టు ఉంది. మిగతా పాత్రల్లో నటించిన సోనూసూద్, జిషు సేన్ గుప్తా, అజయ్, నాజర్, బెనర్జీ పాత్రలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
చిరంజీవి నటన
రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్
మైనస్ పాయింట్స్
బోరింగ్‌గా సాగే కథ, కథనం
కొరటాల శివ డైరెక్షన్స్
గ్రాఫిక్స్
చివరి మాట : ’ఆచార్య’ ఓన్లీ మెగాభిమానులకు మాత్రమే..
రేటింగ్ : 2/5
కథ | : | 2/5 |
స్క్రీన్ ప్లే | : | 2/5 |
దర్శకత్వం | : | 2/5 |
సంగీతం | : | 3/5 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Acharya Movie Review, Chiranjeevi, Koratala siva, Pooja Hegde, Ram Charan, Tollywood