news18-telugu
Updated: November 26, 2020, 10:35 PM IST
చిరంజీవి, రామ్ చరణ్ Photo : Twitter
Acharya-Chiranjeevi-Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోవిడ్ ఆంక్షల తర్వాత రీసెంట్గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి త్వరలో జాయిన్ కానున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ అన్ని సినిమాల్లోలాగే ఆగిపోయింది. ఇక కరోనా లాక్డౌన్ తర్వాత ఒక్కొక్క హీరో షూటింగ్ కోసం దిగుతున్నారు.. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలయ్య వంటి సీనియర్లు షూటింగ్ కోసం రంగంలోకి దిగారు. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ కోసం త్వరలో షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఇక చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో చిరంజీవి కాకుండా మిగతా నటీనటులపై కొన్ని సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నాడు కొరటాల శివ.

చిరంజీవి, రామ్ చరణ్ (File/Photo)
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ షూటింగ్లో పాల్గొనే డేట్స్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇప్పటికే చెర్రీ ఈ సినిమా కోసం రాజమౌళి పర్మిషన్ కూడా తీసుకున్నాడట. ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్.. సంక్రాంతి తర్వాత 21 రోజుల డేట్స్ కేటాయించాడట. పొంగల్ తర్వాత కంటిన్యూగా ఈ సినిమా షూటింగ్లో చెర్రీ పాల్లొని తనకు సంబంధించిన సీన్స్ పూర్తి చేయనున్నాడు. గతంలో రామ్ చరణ్.. తన తండ్రితో కలిసి ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇపుడు పూర్తి స్థాయిలో వీళ్లిద్దరు కలిసి నటించబోతున్న సినిమా ‘ఆచార్య’ కావడం విశేషం. ఈ సినిమాను రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో కంప్లీట్ చేసి మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి.. ఏప్రిల్ 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 26, 2020, 10:35 PM IST