Acharya - Chiranjeevi - Ram Charan - Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు. ఆగష్టు వరకు కరోనా ఉదృతి తగ్గితే.. అదే నెలలో చిరు బర్త్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాపై కొరటాల శివ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ పాత్రలపై మాట్లాడారు. పైగా ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా ఆగిపోయింది. దాదాపు 10 రోజలు షూటింగ్ చేస్తే.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పుకొచ్చారు.మరోవైపు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘ఆచార్య’లో మెయిన్ ఎమోషన్ మొత్తం రామ్ చరణ్ పాత్ర చుట్టూనే తిరుగుతోందని చెప్పుకొచ్చారు. సెకండాఫ్ మాత్రం ఆ పాత్ర రన్ అవుతుందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు రామ్ చరణ్ ఏదైనా చేయాలనుకొని చేయాలేకపోయాడో.. దాన్ని ‘ఆచార్య’గా చిరంజీవి ఎలా కొనసాగించాడనేదే ఈ మూవీ స్టోరీ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డేలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ పాటను రెండో పాటగా విడుదల చేయనున్నట్టు చెప్పుకొచ్చారు.
ఆచార్య విషయానికి వస్తే.. ఈ సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారని తెలిసిందే. అయితే ఆ పాత్రలో ఆయన కేవలం పది నిముషాలు మాత్రమే కనిపిస్తారట. ప్లాష్ బ్యాక్ వచ్చే కొన్ని సీన్స్ లో మాత్రమే అలా కనిపిస్తారట చిరంజీవి.ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి లూసిఫర్ అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులో మోహన్ రాజా దర్శకతం వహించనున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన వేదాళం అనే తమిళ సినిమాను తెలుగులో చేయనున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకుడు. దాంతో పాటు బాబీ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై ఎరిందాల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు చిరు.. వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగాలతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Pooja Hegde, Ram Charan, Tollywood