హోమ్ /వార్తలు /సినిమా /

Koratala Siva: చిరంజీవి ఇంటి దగ్గర ధర్నాకు దిగుతాం.. కొరటాలకు వార్నింగ్..!

Koratala Siva: చిరంజీవి ఇంటి దగ్గర ధర్నాకు దిగుతాం.. కొరటాలకు వార్నింగ్..!

చిరంజీవి ఆచార్య 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

చిరంజీవి ఆచార్య 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

వాళ్లందరికీ ఇప్పుడు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కూడా కొరటాల శివపై పడింది. ఇప్పటికే చిరంజీవి రూ.10 కోట్లు వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 

  మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi ), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’(Acharya). ఈ సినిమా భారీ అంచానల మధ్య విడుదలై... డిజాస్టర్‌గా మిగిలింది. ప్రముఖ  డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చిరు, చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. ఇక కొరటాలకు కూడా తొలి ఓటమి రుచి చూపించింది  ఆచార్య. దీంతో అప్పటిదాకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న శివ ఒక్కసారిగా డీలా పడ్డాడు.

  ఆచార్య  ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆచార్య కష్టాలు ఇంకా శివను వదలడం లేదు. తాజాగా ‘ఆచార్య’ సినిమాతో భారీ నష్టాలు చవిచూసిన 25 మంది ఎగ్జిబిటర్లు కొరటాల ఆఫీసు ముందు నిన్న రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. సినిమాను కొని తాము రూ. 15 కోట్ల వరకూ నష్టపోయామని ఆ లోటులో ఎంతో కొంత భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. లేదంటే చిరంజీవి ఇంటి దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది.

  ac

  విడుదలకు ముందే ఈ చిత్రాన్ని నిర్మాతల దగ్గర నుంచి కొరటాల శివ తీసుకున్నారట. అందుకే బయ్యర్లు నష్టాన్ని కొరటాలనే భరించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఆచార్య సినిమా అసలు ఎన్ని నష్టాలు మిగిలిచ్చింది? ఇక చివరికి ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారు?అనే విషయాలు అయితే తేటతెల్లం అవుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ అనే పేరు పోస్టర్‌పై కనిపిస్తున్నా కానీ పెట్టుబడి పెట్టింది మాత్రం మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మాత్రమేనటా.ఇక ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. చిరంజీవి, చరణ్‌లు తమ వాటాగా దాదాపుగా రూ.50 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఇక అది కాకుండా.. ప్రొడక్షన్ వచ్చేసి రూ.70 కోట్లకు తేలింది. ఆ రూ.70 కోట్లు కూడా మాట్నీకి తిరిగి ఇచ్చేసి.. సినిమా కమర్షియల్ వ్యవహారాల్ని కూడా కొరటాల నెత్తిమీద వేసుకున్నట్టు సమాచారం తెలిసింది.

  దీంతో ఆచార్య సినిమా విషయంలో అటు మాట్నీకి ఇంకా ఇటు కొణిదెల ప్రొడక్షన్‌కి ఎలాంటి సంబంధమూ లేదు. ఇప్పుడు బయ్యర్లని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా కొరటాలపైనే పడిందని సమాచారం తెలుస్తోంది. మరోవైపు ఆచార్య సినిమాను కొన్ని ఏరియాల్లో అయితే కొరటాల సన్నిహితులే రిలీజ్ చేశారు. వాళ్లందరికీ ఇప్పుడు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కూడా కొరటాల శివపై పడింది. ఇప్పటికే చిరంజీవి రూ.10 కోట్లు వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది.  అయితే ఈ రూ.10 కోట్లు అసలు ఎంత మాత్రమూ కూడా సరిపోవు. ఇక ఆయన నుంచి ఇంకా వస్తాయన్న ఆశతో బయ్యర్లు ఎంతో ఆశగా ఉన్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Acharya movie, Chiranjeevi, Koratala siva

  ఉత్తమ కథలు