• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACHARYA MOVIE CHIRANJEEVI RAM CHARAN COMBINATION SCENES LEACKED PICS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Acharya: ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ సీన్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

Acharya: ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ సీన్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ సీన్స్ లీక్ (Instagram/Photo)

Acharya - Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Share this:
    Acharya - Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండంపై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్.. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ .. 20 రోజుల డేట్స్ కేటాయించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. సిద్ధా అనే స్టూడెంంట్ యూనియన్ లీడర్‌ ఎందుకు నక్సలైట్‌గా మారాడనేది ఈ సినిమాలో కీలకం. ఇప్పటికే మారేడుమిల్లిలో రామ్ చరణ్, పూజా హెగ్డేలపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు సినిమాలో 45 నిమిషాలకు పైగా ఉన్నట్టు సమాచారం. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ వెంటనే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.

    తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్న ఫోటోలు సెట్స్ నుంచి లీకయ్యాయి. ఇల్లెందు మైనింగ్ యూనిట్‌లో జరిగిన ఈ షూట్‌కు సంబంధించిన ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.



    ఈ సినిమాలో దేవాలయం సెట్ కోసం  దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ సిటీ ఫోటోలు కూడా చిరు షేర్ చేసాడు. క‌ళా ద‌ర్శ‌కుడు సురేష్ నేతృత్వంలో రూపొందించిన ఈ టెంపుల్ సిటీ సెట్‌కి సంబంధించి చిరంజీవి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక్కడే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేయనున్నాడు కొరటాల శివ. చిరంజీవి సినిమాకు చాలా ఏళ్ళ తర్వాత మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ కాకుండా బయటి మ్యూజిక్ డైరెక్టర్‌తో కొరటాల పని చేయడం ఇదే తొలిసారి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు