Home /News /movies /

Acharya : ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారు..

Acharya : ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారు..

‘ఆచార్య’ మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డేల సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

‘ఆచార్య’ మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డేల సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Acharya - Chiranjeevi - Ram Charan : Acharya : ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారైంది. ఆ పాటను ..

    Acharya - Chiranjeevi - Ram Charan : Acharya : ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఆచార్య మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాట విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ  పాటను నవంబర్ 5న ఉదయం 11.07నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఇక రామ్ చరణ్, పూజా హెగ్డే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’లో జిగేల్ రాణి పాటలో మెరిసింది. ఇపుడు పూర్తి స్థాయిలో రామ్ చరణ్ సరసన ‘ఆచార్య’ సినిమాలో నీలాంబరిగా పాత్రలో కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వీళ్లిద్దరి పాత్రనే హైలెట్ అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 4న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.

    ఈ సినిమాలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీతో చరణ్‌కు ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావడం పక్కా చెబుతున్నారు.

    విక్రమ్ షూటింగ్ స్పాట్‌లో మొదలైన కమల్ హాసన్ బర్త్ డే వేడుకలు..

    సిద్ధ సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే మెరవనుంది. తాజాగా పూజా హెగ్డే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. వీటితో పాటు ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా జవనరి 14న విడుదల కానుంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, అజయ్ దేవ్‌గణ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.


    అందుకే ఆచార్య సినిమాను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో హిందీతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తే.. బాగానే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే లేట్ అయినా.. లేటెస్ట్‌గా ఫిబ్రవరి 4న ఏ హిందీ, తెలుగు సినిమాలు పోటీలో లేని టైమ్‌లో ఈ సినిమాను విడుదల చేేయాలనే నిర్ణయానికి వచ్చారు.

    Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 45 నిమిషాల నిడివి ఉండనుందట.ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    Acharya Movie Another Crazy Update Chiranjeevi Ram Charan Pooja Hegde Second Single Release on November 5  Acharya : ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారు..,Acharya,Ram Charan Pooja Hegde Song,Ram charan Pooja Hegde Acharya Second Single Lyrical Video Song Released,Acharya Hindi Version,Acharya Pan India Project,Chiranjeevi Acharya release date, Chiranjeevi bhola shankar update,tamannah finalised for  bholaa shankar, Chiranjeevi lucifer remake shoot starts, Chiranjeevi lucifer remake titled as godfather, Chiranjeevi news,Chiranjeevi lucifer remake update, Vidya balan, Anushka, Chiranjeevi acharya, Chiranjeevi movies, Chiranjeevi latest news, Chiranjeevi acharya news, Chiranjeevi Koratala siva acharya update, చిరంజీవి, లూసిఫర్, చిరంజీవి భోళా శంకర్,ఆచార్య రిలీజ్ డేట్,ఆచార్య విడుదల తేది హిందీ,ఆచార్య మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు
    ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (Twitter/Photo)


    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (Twitter/Photo)


    చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించబోతన్నట్టు సమాచారం.

    Mani Sharma : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్..

    ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Acharya, Chiranjeevi, Koratala siva, Pooja Hegde, Ram Charan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు