• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • ACHARYA MEGASTAR CHIRANJEEVI RAM CHARAN KORATALA SIVA LATEST MOVIE ACHARAYA MOVIE RELEASED AFTER 28 YEARS TA

Chiranjeevi: దాదాపు 28 ఏళ్ల తర్వాత అలా వస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్ ఆసక్తి..

’ఆచార్య’లో చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi | దాదాపు 28 ఏళ్ల తర్వాత అలా వస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. దీంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.

  • Share this:
    Chiranjeevi | దాదాపు 28 ఏళ్ల తర్వాత అలా వస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. దీంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఈ  సినిమా తెరకెక్కుతూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ..  మే 13న రిలీజ్  చేస్తున్నట్టు ప్రకటించారు. ఐతే.. మే లో సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఓ చిత్రం మే లో విడుదల అవుతోంది. 1993లో మెకానిక్ అల్లుడు సినిమా మే 27న విడుదలై పర్వాలేదనిపించింది.

    అంతకు ముందు రెండేళ్ల ముందు 1991లో గ్యాంగ్ లీడర్ సినిమా మే 9న రిలీజైంది.ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేసింది. దీనికంటే ముందు 1990లో మే 9న విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేయడం విశేషం.

    మేలో విడుదలైన చిరు బ్లాక్ బస్టర్ మూవీస్ జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ (file/photos)


    ఇక 1986లో చిరంజీవి నటించిన ‘వేట’ మూవీ మే 28న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. మొత్తంగా మే లో విడుదలైన చిరంజీవి చిత్రాల్లో రెండు బ్లాక్ బస్టర్స్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే.. ఒకటి యావరేజ్..ఒకటి మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా మెగాస్టార్‌కు రెండు ఇండస్ట్రీ హిట్స్ వచ్చిన మే నెలలో ఇపుడు ‘ఆచార్య’ సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమాపై మెగాభిమానుల్లో ప్రత్యేకమైన  ఆసక్తి నెలకొంది. మరి సెంటిమెంట్ వర్కౌటై చిరంజీవి.. ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తాడా లేదా అనేది చూడాలి. 
    Published by:Kiran Kumar Thanjavur
    First published: