హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌ల కీలక షెడ్యూల్ పూర్తి..

Acharya: ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌ల కీలక షెడ్యూల్ పూర్తి..

‘ఆచార్య’ సినిమా ఇల్లెందులో చిరంజీవి, రామ్ చరణ్ (Instagram/Photo)

‘ఆచార్య’ సినిమా ఇల్లెందులో చిరంజీవి, రామ్ చరణ్ (Instagram/Photo)

Acharya - Chiranjeevi - Ram Charan - Koratala Siva | మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా  కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  Acharya - Chiranjeevi - Ram Charan - Koratala Siva | మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా  కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ చిత్రంపై  అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సినిమా బిజినెస్ కూడా పూర్తైయినట్టు సమాచారం. దాదాపు రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. తెలంగాణ (నైజాం)లో ఇప్పటికే వరంగల్ శ్రీను రూ.  42 కోట్లకు ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, రాయలసీమ (సీడెడ్) కలిపి రూ. 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ రూ. 20 కోట్ల  బిజినెస్ చేసినట్టు సమాచారం. ఆచార్య సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో తొలిసారి పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండంపై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్.. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు.

  ఈ సినిమా కోసం రామ్ చరణ్ .. 20 రోజుల డేట్స్ కేటాయించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. సిద్ధా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్‌ ఎందుకు నక్సలైట్‌గా మారాడనేది ఈ సినిమాలో కీలకం. ఇప్పటికే మారేడుమిల్లిలో రామ్ చరణ్, పూజా హెగ్డేలపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు సినిమాలో 45 నిమిషాలకు పైగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రాజమండ్రి, ఖమ్మం జిల్లా ఇల్లెందులో నెల రోజులకు పైగా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది.

  acharya movie shooting,chiranjeevi acharya movie updates,chiranjeevi twitter,chiranjeevi acharya,chiranjeevi acharya movie location stills,megastar chiranjeevi,chiranjeevi ram charan shooting for acharya,chiranjeevi 152 movie,acharya shooting in east godavari maredupally forest,acharya movie chiranjeevi,chiranjeevi 152 movie release date,acharya movie teaser,చిరంజీవి ఆచార్య,ఆచార్య రిలీజ్ డేట్,చిరంజీవి ఆచార్య షూటింగ్ పిక్స్,రామ్ చరణ్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ఫోటోలు
  చిరంజీవి ఆచార్య షూటింగ్ (Chiranjeevi Acharya Shooting)

  ఈ సినిమాను దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేవాలయం సెట్ కోసం  దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ సిటీ ఫోటోలు కూడా చిరు షేర్ చేసాడు. క‌ళా ద‌ర్శ‌కుడు సురేష్ నేతృత్వంలో రూపొందించిన ఈ టెంపుల్ సిటీ సెట్‌కి సంబంధించి చిరంజీవి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక్కడే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసాడు కొరటాల శివ. ఇప్పటికే  ఈ సినిమా సెట్స్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్న ఫోటోలు సెట్స్ నుంచి లీకయ్యాయి. ఇల్లెందు మైనింగ్ యూనిట్‌లో జరిగిన ఈ షూట్‌కు సంబంధించిన ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Pooja Hegde, Ram Charan

  ఉత్తమ కథలు