హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: ఆచార్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా ఆ రేంజ్‌లో ఉందంట!

Acharya: ఆచార్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా ఆ రేంజ్‌లో ఉందంట!

‘ఆచార్య’ మూవీ (Twitter/Photo)

‘ఆచార్య’ మూవీ (Twitter/Photo)

ఆచార్య సినిమాపై ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సినిమా ఎంత త్వరగా థియేటర్లలో విడుదల అవుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ ఎంతగానే వేచి చూస్తున్న ఆచార్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 29న ఆచార్య సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమాపై ఆచార్య టీంతో పాటు.. అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆచార్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మెగాస్టార్ ఆచార్య సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ప్రముఖ క్రిటిక్ , యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చాశాడు. మన సౌత్ సినిమాలపై తన ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ ఇస్తూ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు ఉమైర్ సంధు. తాజాగా మెగా మల్టీస్టారర్ 'ఆచార్య' సినిమాపై కూడా తన ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు.

యూ/ఏ సర్టిఫికెట్‌తో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఆచార్య మూవీపై ఉమైర్ సంధు తన ఫస్ట్ రివ్యూ ఇస్తూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. 'మాస్ ప్రేక్షకులకు పుల్ మసాలా అందించే సినిమా.. చిరు, చరణ్ తమ పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేశారు'... అని ఆయన ట్వీట్‌లో తెలిపారు. దీంతో ఇప్పుడు ఆచార్య సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే చిరు చరణ్ ఇద్దరు కలిసి నటిస్తోన్న సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందునని అభిమానులు అనుకుంటున్నారు. మెగా మూవీ హిట్ అని ముందే జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలో ఉమైర్ సంధు రివ్యూతో మెగా అభిమానులు మరింత జోష్‌ వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ముగిసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఆచార్య సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆచార్య సినిమాకు యూఎస్‌లో ప్రి బుకింగ్స్ దుమ్ములేపుతున్నాయి. . ఆచార్య సినిమా యూఎస్ లో మూడు లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లను ప్రీ సేల్స్ తో రాబట్టినట్టుగా ప్రైమ్ మీడియా వారు కన్ఫర్మ్ చేశారు

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేశారు. ఇందులో చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి.. ఇక ఈ చిత్రాన్ని శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.

First published:

Tags: Acharya, Acharya movie, Megastar Chiranjeevi, Ram Charan

ఉత్తమ కథలు